Biryani Controversy: శబాష్ నెటిజన్స్.. మహిళలపై చీప్ కామెంట్స్.. వైరల్ చేసి మరీ ఉద్యోగం ఊడబీకించారు

బిర్యానీ(Biryani Controversy), మహిళలపై ఒక వ్యక్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అతడి కెరీర్‌ను రోడ్డున పడేశాయి.

Gurugram techie himanshu jangra fired from starvik design for dirty biryani comments on women

  • మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యువకుడు
  • వైరల్ వీడియోతో ఊడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం
  • కంపెనీ తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయం

BiryaniControversy: సోషల్ మీడియా కాలంలో నోరు జారితే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నిరూపించే ఒక సంచలన ఘటన గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. బిర్యానీ, మహిళలపై ఒక వ్యక్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అతడి కెరీర్‌ను రోడ్డున పడేశాయి. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షు జంగ్ర అనే యువకుడు ‘స్టార్విక్ డిజైన్’ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇటీవల అతడు కమెడియన్ ప్రణీత్ మోరే నిర్వహించిన ఒక షోలో పాల్గొన్నాడు. ఆ సమయంలో అమ్మాయిలతో డేటింగ్ అంశంపై మాట్లాడుతూ.. “ఒక అమ్మాయికి కేవలం రూ. 370 పెట్టి బిర్యానీ(Biryani Controversy) తినిపిస్తే, దానికి బదులుగా ఆమె నుంచి శారీరక సుఖాన్ని ఆశిస్తాను” అంటూ మహిళలను కించపరిచేలా మాట్లాడాడు.

H1BVisa: భారతీయ ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్.. హెచ్‌-1బీ వీసా ఫీజు చట్టవిరుద్ధం.. అమెరికా కోర్టు సంచలన తీర్పు

దీనికి తోడు మహిళలపై మరికొన్ని దారుణమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అతడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, వ్యతిరేకత రావడంతో హిమాన్షు జంగ్ర భయపడిపోయాడు. వెంటనే స్పందిస్తూ నెటిజన్లకు క్షమాపణలు చెప్పాడు. రచ్చ పెద్దదవుతోందని గ్రహించి, ముందస్తు జాగ్రత్తగా తన సోషల్ మీడియా ఖాతాలను కూడా డిలీట్ చేశాడు. అయినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు. అతడు పనిచేస్తున్న కంపెనీని ట్యాగ్ చేస్తూ, ఇలాంటి వికృత మానసిక స్థితి ఉన్న వ్యక్తిని ఉద్యోగంలో ఎలా కొనసాగిస్తారంటూ సదరు సంస్థపై ఒత్తిడి పెంచారు.

ఈ వివాదం కాస్తా ‘స్టార్విక్ డిజైన్’ కంపెనీ అధినేత వివేక్ విశ్వకర్మ దృష్టికి వెళ్లింది. మహిళల పట్ల అంత అసభ్యకరంగా మాట్లాడిన ఉద్యోగిపై ఆయన తక్షణమే అంతర్గత విచారణ జరిపించారు. హిమాన్షు చేసిన తప్పు రుజువుకావడంతో, అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కంపెనీ సీఈఓ సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “మహిళలను గౌరవించని వారి పట్ల మా సంస్థలో జీరో టాలరెన్స్ విధానం ఉంటుంది.. చేసే తప్పులకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయనడానికి ఇదే ఉదాహరణ” అని ఆయన పేర్కొన్నారు.