కరోనా వైరస్ వచ్చి ప్రజలను బాధలకు గురిచేసినా కొన్ని మంచి అలవాట్లు ప్రజలకు నేర్పింది. పరిశుభ్రంగా ఉండటం, పరిసరాలు శుభ్రం చేసుకోవటం, మాస్క్ ధరించటం వంటి వాటికి ప్రజలు అలవాటు పడ్డారు. పలు ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు.
బయటకు వెళ్లి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కుని ఇంట్లోకి రావటం…ఎక్కడకు వెళ్లినా శానిటైజర్ వెంట తీసుకువెళ్లటం అలవాటు చేసుకున్నారు. బయటకు వెళ్లాలంటే శానిటైజర్ బాటిల్ కానీ, స్ప్రే బాటిల్ కానీ తీసుకువెళ్లాల్సి వస్తోంది. అయితే వీటిని బయటకు తీసుకు వెళ్ళటం కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో వ్యాపారస్తులు కొత్త పద్దతిలో వీటిని తీసుకు వెళ్లేందుకు సులువైన మార్గాలు అన్వేషించారు. కనీసం 50 ML, 30ML శానిటైజర్ నింపుకుని వెళ్లే విధంగా కీ చైన్లు తయారు చేశారు.
కార్లు, ద్విచక్రవాహనాల తాళాలు తగిలించుకునే విధంగా వీటిని తయారు చేయటంతో ప్రజలు వీటిని కొనే ప్రయత్నాల్లో ఉన్నారు. వీటితో పాటు పిల్లలకు కూడా ఆకర్షణీయమైన బొమ్మలు తయారు చేశారు.