Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్ పతి.. కోటి రూపాయలు గెలుచుకున్న ఐపీఎస్ ఆఫీసర్.. రూ.కోటి ప్రశ్న ఇదే..

ప్రారంభమైన రెండు వారాల్లోనే తొలి కరోడ్ పతిగా ఆదిత్య కుమార్ నిలిచారు. కొంత సందేహం ఉన్నా 50-50 లైఫ్‌ లైన్ ఉపయోగించి.. (Kaun Banega Crorepati)

Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్ పతి.. కోటి రూపాయలు గెలుచుకున్న ఐపీఎస్ ఆఫీసర్.. రూ.కోటి ప్రశ్న ఇదే..

Updated On : August 21, 2025 / 11:42 PM IST

Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌ 17లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ సత్తా చాటారు. కోటి రూపాయలు గెలుచుకున్నారు. తద్వారా ఈ సీజన్‌లో తొలి కోటీశ్వరుడిగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఆదిత్య కుమార్ సీఐఎస్ఎఫ్ లో(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) డిప్యూటీ కమాండెంట్. ఆగస్ట్ లో కేబీసీ సీజన్ 17 స్టార్ట్ అయ్యింది. ప్రారంభమైన రెండు వారాల్లోనే తొలి కరోడ్ పతిగా ఆదిత్య కుమార్ నిలిచారు.(Kaun Banega Crorepati)

కోటి రూపాయల ప్రశ్న ఇదే..

మొదటి అణు బాంబులో ఉపయోగించిన ప్లూటోనియం మూలకాన్ని వేరు చేసిన శాస్త్రవేత్త పేరు మీద ఏ మూలకం పెట్టబడింది?

ఆప్షన్స్..
రూథర్ ఫోర్డియమ్
ఫెర్మియమ్
సీబోర్జియం
మీట్ నీరియమ్

కొంత సందేహం ఉన్నా 50-50 లైఫ్‌ లైన్ ఉపయోగించి రెండు తప్పు సమాధానాలను తొలగించారు ఆదిత్య. చివరికి “సీబోర్జియం” అని సమాధానం చెప్పారు. అది కరెక్ట్ ఆన్సర్ కావడంతో స్టూడియో మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది. అమితాబ్ బచ్చన్ ఆదిత్యను అభినందించారు.(Kaun Banega Crorepati)

సీబోర్జియం (ఎస్‌జీ) అమెరికన్ కెమిస్ట్ గ్లెన్ టి.సీబోర్గ్ పేరు మీదుగా పెట్టబడింది. ఆయన తన బృందంతో కలిసి 1940లో ప్లూటోనియాన్ని వేరు చేశారు. చరిత్రలో ఒక మూలకం తన పేరు మీదుగా పెట్టబడిన ఏకైక శాస్త్రవేత్త ఈయనే. ఈ మూలకం నాగసాకి అణు బాంబులోనూ ఉపయోగించబడింది. ఈ సమాధానం ఆదిత్యను KBC 17వ సీజన్‌లో తొలి కోటీశ్వరుడిగా నిలిపింది. కోటి రూపాయలతో పాటు బ్రెజ్జా కారును బహుమతిగా అందుకున్నారు.

కాగా, 7 కోట్ల రూపాయల ప్రశ్నకు మాత్రం ఆదిత్య జవాబు చెప్పలేకపోయారు. Kaun Banega Crorepati

7 కోట్ల ప్రశ్న ఇదే..
1930లలో భారత్‌ను సందర్శించి తాజ్ మహల్, సాంచీ స్తూపం, ఎల్లోరా గుహలను చిత్రించిన జపాన్ చిత్రకారుడు ఎవరు?

ఆప్షన్స్:
హిరోషిమా సుగిమోటో
హిరోషి సెన్జు
హిరోషి యోషిదా
హిరోషి నకాజిమా

రూ. 7 కోట్ల ప్రశ్నకు సరైన సమాధానం తెలియకపోవడంతో షో నుంచి తప్పుకోవాలని ఆదిత్య నిర్ణయించుకున్నారు.

వెళ్లిపోయే ముందు ఏదో ఒకటి చెప్పాలని అమితాబ్ కోరగా.. ఆప్షన్ D (హిరోషి నకాజిమా) ని ఎంపిక చేసుకున్నారు ఆదిత్య. అది తప్పు అని, సరైన సమాధానం C (హిరోషి యోషిదా) అని అబితాబ్ తెలిపారు.(Kaun Banega Crorepati)

ఉత్తరాఖండ్‌కు చెందిన ఆదిత్య కుమార్ ప్రస్తుతం గుజరాత్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. ఆయన CISFలో డిప్యూటీ కమాండెంట్. ఆయన భారత దేశంలో మొత్తం మీద 6వ ర్యాంక్ సాధించారు.

KBCలో ఆదిత్య సాధించిన విజయాన్ని క్విజ్ షో విజయంగా మాత్రమే కాకుండా, కష్టపడి పని చేయడం ద్వారా పెద్ద విజయాలు సాధించాలని కలలు కనే యువతకు ప్రేరణగా నిలుస్తుంది.

Also Read: ‘సూత్ర వాక్యం’ మూవీ రివ్యూ.. మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో..