Hanuman Temple : హనుమాన్ ఆలయంలో విషాదం.. మండపం కూలి ఏడుగురు మృతి, శిథిలాల్లో ఇంకా 25 మంది?

Hanuman Temple Roof : నిర్మాణంలోని హనుమాన్ ఆలయంలో బాల్కనీ అకస్మాత్తుగా కుప్పకూలి ఘోర ప్రమాదం జరిగింది, ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. శిథిలాల కింద 20 నుంచి 25 మంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు.

Hanuman Temple Roof

Hanuman Temple Roof : మహారాష్ట్రలోని పర్భణి జిల్లాలో శనివారం (జూన్ 20) ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయానికి చెందిన మండపం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ప్రమాదం సమయంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు ఉన్నారు. వారిలో చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ విషాద ఘటనలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ ప్రమాద ఘటనలో 20 నుంచి 25 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. ఈ గందరగోళం మధ్య పోలీసులు, పరిపాలనా యంత్రాంగం, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుకున్నాయి. ప్రస్తుతం సహాయక, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.

Read Also : Sunkari Narahari : నరహరి బ్యాంకు లాకర్లు​ బద్దలుకొట్టిన ఏసీబీ.. భారీగా నోట్ల కట్టలు చూసి షాక్.. రూ. 5 కోట్ల నగదు ఫ్రీజ్!

సీసీటీవీలో రికార్డు :
ఈ విషాద ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో భక్తులు హనుమంతుని విగ్రహం ముందు పూజలు చేస్తుండగా ప్రసాదం కూడా సమర్పిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా నిర్మాణంలో ఉన్న హనుమాన్ మందిరం మండపం కూలిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డు అయింది.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు :
ఈ ఘోర ప్రమాదంలో శిథిలాల కింద మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన భక్తులను చికిత్స కోసం పర్భణి జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్యను అధికారిక యంత్రాంగం ఇంకా ధృవీకరించలేదు. పర్భణి సంరక్షక మంత్రి మేఘనా బోర్డికర్ ఈ ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణించి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.