Harivansh Narayan Singh : హరివంశ్‌ నారాయణ్‌ సింగ్ హ్యాట్రిక్.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా మరోసారి ఎన్నిక.. మోదీ ప్రశంసలు..

Harivansh Narayan Singh : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Harivansh Narayan Singh

  • రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ 
  • వరుగా మూడోసారి ఎన్నికైన హరివంశ్
  • శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

Harivansh Narayan Singh : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే తరపున హరివంశ్ పేరును కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ వంటి ప్రముఖులు ప్రతిపాదించగా.. విపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ అధికారికంగా ప్రకటించారు. హరివంశ్ నారాయణ్ సింగ్ ఇప్పటికే రెండు దఫాలుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మరోసారి ఎన్నికయ్యారు. దీంతో హ్యాట్రిక్ కొట్టారు.

Also Read : Gold Price Today : బంగారం ప్రియులకు భారీ శుభవార్త.. కుప్పకూలిన ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

హరివంశ్ నారాయణ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నిక అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా హరివంశ్ పై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. మనస్ఫూర్తిగా అభినందించారు. హరివంశ్ సుదీర్ఘ అనుభవం పెద్దల సభకు ఎంతో ఉపయోగ పడుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఆయన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి జర్నలిజం, రాజకీయాల్లో తనదైన ముద్రవేసి, నేడు మూడోసారి ఈ కీలక పదవిని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. సభను నిష్పక్షపాతంగా, హుందాగా నడపడంలో ఆయనకు ఉన్న నేర్పు సభకు అలంకారమని అన్నారు. డిప్యూటీ చైర్మన్ కొత్త పదవీకాలం కూడా ఇదే స్ఫూర్తి, సమతుల్యత, అంకితభావంతో కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను. మనందరి కృషితో, సభ గౌరవం కొత్త శిఖరాలను చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.


మూడోసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్ ను రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, జేపీ నడ్డాతోపాటు పలువురు అభినందించారు.