Viral Video : నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్.. తుపాకులతో కాల్పులకు దిగిన రౌడీలను చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ, వీడియో వైరల్

రౌడీల చేతుల్లో తుపాకులు ఉన్నాయని, కాల్పులు జరుపుతారనీ తెలుసు. అయినా అదరలేదు, బెదరలేదు.

Viral Video : నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్.. తుపాకులతో కాల్పులకు దిగిన రౌడీలను చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ, వీడియో వైరల్

Woman Chased Gunmen With Broom Stick (Photo : Google)

అసలే రౌడీలు. ఆపై తుపాకులతో వచ్చారు. యధేచ్చగా కాల్పులు జరుపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు. ప్రాణభయంతో పరుగులు తీస్తారు. ఇందులో సందేహమే లేదు. కానీ, ఆ మహిళ అస్సలు భయపడలేదు. వీరనారిలా ధైర్యంగా బయటకు వచ్చింది. రౌడీల చేతుల్లో తుపాకులు ఉన్నాయని, వారు కాల్పులు జరుపుతారనీ తెలుసు. అయినా అదరలేదు, బెదరలేదు. కేవలం చీపురు కర్ర సాయంతో ఆ రౌడీలను తరిమి తరిమికొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హరియానాలోని బివానీలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. ఇంతలో నలుగురు యువకులు రెండు బైకులపై వచ్చారు. ఇద్దరు వ్యక్తులు కిందకు దిగారు. వారి దగ్గర తుపాకులు ఉన్నాయి. వెంటనే వారిద్దరూ ఇంటి బయట నిల్చున్న వ్యక్తిపై కాల్పులు జరిపారు. వెంటనే అలర్ట్ అయిన అతడు వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి పారిపోయాడు. దాడి నుంచి తప్పించుకోగలిగాడు.

Also Read : పిల్లలతో కలిసి షాపింగ్‌కు వెళ్తున్నారా? తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి

దుండగులు ఇంట్లోకి చొరబడేందుకు యత్నిస్తుండగా.. కాల్పుల శబ్దం విన్న ఓ మహిళ ఇంట్లో నుంచి పరుగు పరుగున బయటకు వచ్చింది. చేతిలో పెద్ద చీపురు కర్రతో ఆమె బయటకు వచ్చింది. కాల్పులు జరుపుతున్న రౌడీలపై దాడికి వెళ్లింది. ఆమె రాకతో రౌడీలు అక్కడి నుంచి పారిపోయారు. అలా ఆ మహిళ కేవలం చీపురు కర్ర సాయంతో దుండగులను తరిమికొట్టింది.

ఆ మహిళ చూపిన తెగువ, ధైర్య సాహసాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వీరనారి అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. ఆమె గట్స్ కు, గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సాధారణంగా కాల్పుల శబ్దం వినిపిస్తే ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా ఎవరూ సాహసం చేయరు. పురుషులు కూడా ప్రాణభయంతో ఇంట్లోనే ఉండిపోతారు. అలాంటిది ఓ మహిళ ఎంతో ధైర్యంగా బయటకు వచ్చింది. కాల్పులు శబ్దం వినిపించగానే, ఎదురింటి వ్యక్తి ఆపదలో ఉన్నాడని తెలియగానే ఆమె ఊరుకోలేదు.

Also Read : కొంపముంచిన అత్యాశ.. 4కోట్లు పోగొట్టుకున్న వృద్ధురాలు, ఘరానా మోసం

రౌడీల చేతిలో ఆయుధాలు ఉన్నాయని తెలిసినా, వాళ్లు తనపై తుపాకీ ఎక్కుపెట్టినా, కాల్పులు జరిపినా ఆమె భయపడలేదు. ఆ సమయంలో బయటకు వెళ్లడం తన ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా వెనకడుగు వేయలేదు. తన చేతికి అందిన పెద్ద చీపురు కర్రనే ఆయుధంగా చేసుకుని దుండగులపైకి దూసుకెళ్లింది. వారిని ధైర్యంగా ఎదుర్కొంది. వారిని భయపెట్టి అక్కడి నుంచి పారిపోయేలా చేసింది. ఆ విధంగా ఆ మహిళ ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. కాగా, పారిపోతున్న క్రమంలో ఒక దుండగుడు ఆ మహిళపై కాల్పులు జరిపాడు. అయితే, ఆమెకు గాయాలేమీ కాలేదు.

ఒకవేళ సమయానికి ఆ మహిళ బయటకు రాకపోయి ఉంటే.. దుండగులు ఇంట్లోకి చొరబడి ఆ వ్యక్తిని కాల్చి చంపేవారే. కానీ, మహిళ వీరోచిత ప్రతిఘటనతో వారు అక్కడి నుంచి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది.

దుండుగుల కాల్పుల నుంచి తప్పించుకున్న వ్యక్తిని హరికిషన్ గా పోలీసులు గుర్తించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో అతడికి సంబంధం ఉంది. రవి బాక్సర్ హత్య కేసులో హరికిషన్ నిందితుడు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు. బివానీలోని తన ఇంటి బయట నిల్చుని ఉండగా.. దుండగులపై అతడిపై కాల్పులకు తెగబడ్డారు. దుండగులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నాలుగు బుల్లెట్ల తగలడంతో హరికిషన్ గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, హరికిషన్ ను కాపాడిన మహిళ.. అతడి బంధువా? లేక ఎదురింట్లో ఉండే మహిళ? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.