Viral Video : పార్కులో బేస్‌బాల్ బ్యాట్‌తో భార్యను చితక్కొట్టిన భర్త..
భార్యను భర్త బేస్‌బాల్ బ్యాట్‌తో కొడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 17, 2024 / 07:15 PM IST
Haryana man hits wife with baseball bat in park
భార్యను భర్త బేస్‌బాల్ బ్యాట్‌తో కొడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్యానా రాష్ట్రంలోని పంచకులలోని సెక్టార్ 26లోని పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యను భర్త కొడుతున్న వీడియోను మరో వ్యక్తి రికార్డు చేశాడు.
వీడియోలో ఏం ఉందంటే..?తన భార్య వేరే వ్యక్తితో కలిసి కారులో ఉన్నట్లు గుర్తించిన భర్త బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేశాడు. ముందుగా కారు అద్దాన్ని పగులగొట్టాడు. మహిళ ఆపమని కోరినప్పటికీ అతడు బేస్‌బాల్ బ్యాట్‌తో ఆమెను కొట్టడం ప్రారంభించాడు. తన భార్య తనను మోసం చేసిందని ఆ వ్యక్తి ఆరోపించడం వీడియోలో వినిపించింది.
కారు లోపల మహిళతో పాటు ఉన్న వ్యక్తి ఈ తతంగం చూస్తూనే ఉన్నాడు తప్పిస్తే ఆమెను రక్షించేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. మహిళ కేకలు వేయడంతో పార్కులోని వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. ఆమెపై దాడి చేయకుండా అతడిని అడ్డుకున్నారు.
Viral Video: టికెట్ లేకుండా ఎంత మంది రైలు ఎక్కారో చూడండి..
కాగా.. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
