UP Elections: యూపీ ఎన్నికల్లో మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి బికినీ ఫోటోలు వైరల్
ఉత్తరప్రదేశ్ కు చెందిన అర్చనా గౌతమ్ అనే మోడల్, నటి యూపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె బికినీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
- Bharath Reddy
- Published On : January 16, 2022 / 07:48 AM IST
Archana
UP Elections: సినీ తారలకు ఎన్నికల్లో పలు పార్టీలు టికెట్లు ఇవ్వడం కొత్తేమి కాదు. అనేక మంది సినీ తారలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోకసభ స్థానానికి ప్రాథినిధ్యం వహిస్తున్నారు. ఇక పశ్చిమబెంగాల్ కు చెందిన మీమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్ అనే నటీమణులు సైతం టీఎంసీ పార్టీ నుంచి ఎంపీలుగా గెలుపొందారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన అర్చనా గౌతమ్ అనే మోడల్, నటి కూడా ఈ జాబితాలో చేరింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాకు చెందిన అర్చనా గౌతమ్ నవంబర్ 21న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆమెను హస్తినాపుర్ అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
Also read: Brave Woman: డ్రైవింగ్ లో మూర్చపోయిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన మహిళ
కాగా రాజకీయాల్లోకి రాకముందు.. నటిగా మోడల్ గా అర్చన గౌతమ్ బాగా పాపులర్ అయింది. 2018లో మిస్ ఇండియా బికినీగా గెలిచిన అర్చనా గౌతమ్, మిస్ కాస్మో వరల్డ్ 2018 గానూ, మిస్ ఉత్తరప్రదేశ్ 2014 గానూ నిలిచింది. అయితే ప్రస్తుతం ఈమెకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంతో.. హస్తినాపుర్ నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోయారట. అందమైన ఈ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరంటూ గూగుల్ లో వెతకగా.. అమ్మడి బికినీ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ బికినీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మోడల్ అవ్వాలన్న కోరికతో గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన అర్చనా.. కొన్ని దక్షిణాది చిత్రాల్లోనూ, ఒకటి రెండు హిందీ చిత్రాలు సీరియల్లోనూ నటించింది.
Also read: American Thieves: గూడ్స్ రైల్లో పార్సిల్స్ ను కాజేస్తున్న అమెరికా దొంగలు
అయితే తన సొంత ఊరిలో రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి విన్న అర్చనా.. ఆమేరకు వారికి సహాయం చేయాలనీ భావించి రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపింది. అంతేకాక..ఎన్నికల్లో గెలిస్తే.. చరిత్ర పరంగా ఎంతో విశిష్టత ఉన్న హస్తినాపుర్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేస్తానని అర్చనా వివరించింది. తన వ్యక్తిగత అభిరుచి మేరకు గ్లామర్ ఫీల్డ్ కి వెళ్లానని.. కావునా ప్రజలు తన ఇష్టాన్ని గౌరవించి వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలకు ముడిపెట్టకుండా తనకు ఓటు వేయాలని కోరుతుంది. ప్రజలు తన బికినీ ఫోటోలను చూసి ఓటు వేయాల్సిన అవసరం లేదని..తనపై నమ్మకం ఉంటేనే ఓటు వేయాలని కోరుతుంది.
Also read: ICC U19 World Cup 2022: బోణి కొట్టిన యువ భారత్.. చెలరేగిన బౌలర్లు!
