American Thieves: గూడ్స్ రైల్లో పార్సిల్స్ ను కాజేస్తున్న అమెరికా దొంగలు

అమెజాన్, టార్గెట్, ఫెడెక్స్, UPS వంటి ప్రముఖ కొరియర్ కంపెనీలకు చెందిన పార్సెల్స్ లక్షల సంఖ్యలో మాయమౌతున్నట్లు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.

American Thieves: గూడ్స్ రైల్లో పార్సిల్స్ ను కాజేస్తున్న అమెరికా దొంగలు

Train Thieves

American Thieves: వేయి కాదు రెండు వేలు కాదు లక్షల సంఖ్యలో వినియోగదారులకు చేరవలసిన పార్సెల్స్ మాయం అవుతున్నాయి. అది కూడా సీలు చేయబడ్డ గూడ్స్ రైళ్లలో. కదులుతున్న గూడ్స్ రైళ్లను టార్గెట్ గా చేసుకుని.. అమెజాన్, FedEx, UPS వంటి సంస్థలకు చెందిన లక్షల కొద్ది పార్సెల్స్ ను దొంగలు కాజేస్తున్నారు. ఈ భారీ చోరీ ఘటనలు అమెరికా దేశంలోని లాస్ ఏంజెలిస్ నగరంలో వెలుగుచూశాయి. అమెరికాలో ట్రైన్ చోరీలు ఆందోళకర స్థాయిలో పెరిగిపోతున్నాయని ఇటీవల అక్కడి పోలీసులు అధికారులు, నేర నియంత్రణ సంస్థలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా అమెజాన్, టార్గెట్, ఫెడెక్స్, UPS వంటి ప్రముఖ కొరియర్ కంపెనీలకు చెందిన పార్సెల్స్ లక్షల సంఖ్యలో మాయమౌతున్నట్లు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.

Also read: Rajadhani Train: భారీ సిమెంట్ పిల్లర్ ను ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్

సెంట్రల్ లాస్ ఏంజిల్స్‌లోని జనసాంద్రత కలిగిన ” లింకన్ హైట్స్” ప్రాంతంలోని రైల్వే జంక్షన్ వద్ద యూనియన్ పసిఫిక్ పార్సెల్ రైళ్లు(UP), యునైటెడ్ స్టేట్స్ సర్వీసెస్ కు చెందిన గూడ్స్ రైళ్లు (UPS) తమ కార్గోను అన్‌లోడ్ చేస్తాయి. రైల్వే టెర్మినల్ కు చేరుకునే నిముషాల ముందు లింకన్ హైట్స్ ప్రాంతంలో రైళ్లు కొద్దిగా నెమ్మదిస్తుంటాయి. ఆసమయంలో దొంగలు గూడ్స్ బోగీల తాళాలను పగలగొట్టి తలుపులు తెరిచి గూడ్స్ లోకి ఎక్కేస్తారు. నిత్యం 90 నుంచి 100 బోగీల పార్సెల్స్ ను దొంగలు కాజేస్తున్నారు. ఆగిన ప్రతి గూడ్స్ రైల్లో ప్రతి ఐదింటిలో ఒక బోగీను దొంగలు దోచుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతకు అర్ధం పడుతుంది.

Also Read: BrahMos missiles: ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులు, అదే బాటలో అరబ్ దేశాలు

డిసెంబర్ 2020 నాటికీ చోరీల శాతం 160గా(గతంతో పోలిస్తే) ఉండగా..2021 నాటికీ అది 356 శాతానికి పెరిగింది. డిసెంబర్ 2021 నుంచి జనవరి 2022 మొదటి వారంలోనే లక్షకు పైగా పార్సెల్స్ ను దొంగిలించినట్లు లాస్ ఏంజెల్స్ కౌంటీ పోలీసులు పేర్కొన్నారు. కాగా పార్సెల్స్ చోరీలపై ఆయా రైల్వే సంస్థలకు సమాచారం ఉన్నా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం కొసమెరుపు. ఇదే విషయంపై లాస్ ఏంజెల్స్ పోలీసులు స్పందిస్తూ.. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు.. ఆయా కొరియర్ సంస్థల నుంచి వచ్చాయని, పార్సెల్స్ చోరీలపై రైల్వే సంస్థలైన యూనియన్ పసిఫిక్, యునైటెడ్ పార్సెల్ సర్వీసెస్ లు ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని పేర్కొన్నారు.

Also read: UP Elections: గోరఖ్‌పూర్ నుంచి యోగిని బరిలో దించడంపై బీజేపీ మాస్టర్ ప్లాన్

ఇక రైలు చోరీలపై తరుచు వస్తున్న వార్తల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు జాన్ ష్రెయిబర్ అనే ఫోటో జర్నలిస్టు ఇటీవల రైళ్లు ఆగే లింకన్ హైట్స్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కనుచూపు మేరలో రైలు పట్టాలపై పడిఉన్న..గుట్టల కొద్ది ఖాళీ పార్సెల్ సంచులను చూసి జాన్ ష్రెయిబర్ ఆశ్చర్యపోయాడు. దొంగలు చేస్తున్న పని పట్టపగలు కంటికి కనిపిస్తున్నా.. అటు పోలీసులు గాని, ఇటు రైలు/కొరియర్ సంస్థలు గాని పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. పట్టాలపై పడి ఉన్న ఒక పార్సెల్ పై ఉన్న ట్రాకింగ్ కోడ్ ఆధారంగా.. కొరియర్ సంస్థ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆ పార్సెల్ వివరాలు సేకరించిన ష్రెయిబర్, అది ఇప్పటికీ ట్రాన్సిట్ లోనే ఉన్నట్లు చూపిస్తుందని పేర్కొన్నాడు. ఇలా ఎన్నో లక్షల పార్సెల్స్ కోసం ఎదురు చేస్తున్న వేల మంది కస్టమర్లకు..చోరులు అడ్డంకిగా మారారని జాన్ ష్రెయిబర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Also read: Pakistan: ఇమ్రాన్ వచ్చాక మరింత దిగజారిన పాక్ పాసుపోర్టు విలువ