UP Elections: గోరఖ్‌పూర్ నుంచి యోగిని బరిలో దించడంపై బీజేపీ మాస్టర్ ప్లాన్

ఆదిత్యనాథ్ ను గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దించడంలో బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ ఉంది. హిందువులు అధిక ప్రాబల్యం ఉన్న గోరఖ్‌పూర్ స్థానం 1967 నుంచి బీజేపీకి కీలకంగా ఉంది

UP Elections: గోరఖ్‌పూర్ నుంచి యోగిని బరిలో దించడంపై బీజేపీ మాస్టర్ ప్లాన్

Yogi

UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ఈక్రమంలో అధికార బీజేపీ శనివారం మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ప్రతిపక్ష పార్టీ అధినేతలు..ఇంకా ఒక నిర్ణయానికి రాకముందే, బీజేపీ అభ్యర్థి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను గోరఖ్‌పూర్ అర్బన్ నియియోజకవర్గ అభ్యర్థిగా బరిలో దించుతున్నట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఆదిత్యనాథ్ ను ఈ నియోజకవర్గం నుంచే బరిలోకి దించడంలో బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ ఉంది. హిందువులు అధిక ప్రాబల్యం ఉన్న గోరఖ్‌పూర్ స్థానం..1967 జనసంఘ్ కాలం నుంచి బీజేపీకి ఎంతో కీలకంగా ఉంది. అంతే కాదు 1998 నుంచి 2017లో తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు యోగి గోరఖ్‌పూర్ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఇక్కడి ప్రజల్లో యోగికి ఉన్న అభిమానాన్ని క్రెడిట్ చేసుకోవాలని భావించిన బీజేపీ అధిష్టానం.. యోగిని గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దించింది.

Also read: Pakistan: ఇమ్రాన్ వచ్చాక మరింత దిగజారిన పాక్ పాసుపోర్టు విలువ

అంతే కాదు గోరఖ్‌పూర్ ప్రజలు యోగిని ఒక సీఎంగా కంటే తమ సొంత మనిషిగా అభిమానిస్తారు.1967 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గంలో 1980 నుంచి 1989 వరకు బీజేపీ నేత సునీల్ శాస్త్రి , 1989 నుంచి 2002 వరకు శివ ప్రతాప్ శుక్లా ప్రాతినిధ్యం వహించారు. ఇక 2002 నుంచి బీజేపీ నేత రాధా మోహన్ దాస్ అగర్వాల్.. గోరఖ్‌పూర్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీన్నిబట్టే తెలుస్తుంది.. బీజేపీకి గోరఖ్‌పూర్ ఎంత మైలేజ్ ఇస్తుందని. అయితే ప్రస్తుతం సీఎం యోగిని ఇక్కడి నుంచే బరిలో దించడంపై బీజేపీ ప్లాన్ మరోలా ఉంది. యోగి పేరు మొదటి నుంచి ఇక్కడి ప్రజలకు సుపరిచితం. దీంతో ఆయన ప్రత్యేకించి ప్రచారం నిర్వహించాల్సిన అవసరం లేదు. ప్రచార సమయాన్ని, యోగి చరిష్మాను రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల కూర్పుకు వినియోగించుకోవచ్చని భావించిన బీజేపీ రాష్ట్ర ఇంచార్జి ధర్మేంద్ర ప్రదాన్, ఆమేరకు యోగిని గోరఖ్‌పూర్ అర్బన్ కు కేటాయించారు.

Also read: Y.V Subba Reddy: ఒకరిని తొక్కేసి మరొకరిని ఆశీర్వదించాల్సిన అవసరం మాకు లేదు

ఇక బీజేపీ స్టార్ క్యాంపైనర్లతో కలిసి యోగి ఆదిత్యనాథ్..యూపీ ఎన్నికల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇదిలాఉంటే.. ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఈ ఎన్నికల్లో తమ వ్యక్తిగత పోటీపై ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్.. ఈ ఎన్నికల్లో తాను పోటీచేయనని మొదట ప్రకటించినా..పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని హింట్ ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే పార్టీ నేతలు చెప్పుకొస్తున్నా.. ఎక్కడి నుంచి బరిలో దిగుతారనే విషయం తెలియాల్సి ఉంది. ఇక మరో ప్రతిపక్ష నేత, బీఎస్పీ అధినేత మాయావతి సైతం ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఇప్పటికే స్పష్టం చేయగా.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా పోటీపై ఎటువంటి సమాచారం లేదు.

Also read: Pongal in AP: వేటపాలెంలో అలరిస్తున్న పడవల పోటీలు