Pakistan: ఇమ్రాన్ వచ్చాక మరింత దిగజారిన పాక్ పాసుపోర్టు విలువ

IATAలో సభ్యత్వం ఉన్న199 దేశాల పాసుపోర్టులపై..వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని విలువను లెక్కిస్తుంది HPI. ఈక్రమంలో 2022కి గానూ పాకిస్తాన్ పాసుపోర్టు విలువ 108వ స్థానానికే పరిమితం

10TV Telugu News

Pakistan: పాకిస్తాన్ పాసుపోర్టు విలువ వరుసగా మూడో ఏడాది అధమ స్థానానికే పరిమితం అయింది. అంతర్జాతీయంగా ప్రతి ఏడాది లెక్కించే పాసుపోర్టు విలువలో 111 స్థానాలకు గానూ పాకిస్తాన్ 108వ స్థానానికి పరిమితం అయింది. “హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్” (HPI) అనే సంస్థ అంతర్జాతీయంగా ప్రతి ఏడాది పాసుపోర్టు విలువలను లెక్కిస్తుంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (IATA)లో సభ్యత్వం ఉన్న199 దేశాల పాసుపోర్టులపై..వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని విలువను లెక్కిస్తుంది HPI. ఈక్రమంలో 2022కి గానూ పాకిస్తాన్ పాసుపోర్టు విలువ మరోసారి 108వ స్థానానికే పరిమితం అయింది. దీని తరువాతి స్థానాల్లో సిరియా, ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల పాసుపోర్టులు ఉన్నాయి. పాకిస్తాన్ పాసుపోర్టు విలువ ఉత్తర కొరియా పాసుపోర్టు(104వ స్తానం) కంటే నాలుగు స్థానాలు దిగువకు పడిపోవడంపై పాకిస్తాన్ దేశ ప్రజలు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా దేశం పరువును తీశారంటూ ఆ దేశ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

Also read: Y.V Subba Reddy: ఒకరిని తొక్కేసి మరొకరిని ఆశీర్వదించాల్సిన అవసరం మాకు లేదు

పాకిస్తాన్ పాసుపోర్టు విలువ దిగజారడంపై ఆదేశ ప్రతిపక్ష నేతలు, ప్రజలు మండిపడుతున్నారు. “పాకిస్తానీ పాస్‌పోర్ట్ ప్రపంచంలో “4వ చెత్త” పాస్‌పోర్ట్ గా నిలిచింది. “ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ పతనం మరియు ఇప్పుడు అంతర్జాతీయంగా పోయిన పరువు. నయా పాకిస్థాన్‌కు స్వాగతం” అంటూ ప్రతిపక్ష పీపీసీ పార్టీ చైర్మన్ బిలావల్ కు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మీర్ సోహ్రాబ్ ఖాన్ మారి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇక పాకిస్తాన్ ప్రభుత్వంపై, ఇమ్రాన్ ఖాన్ తీరుపై ప్రజలు సోషల్ మీడియాలో జోరుగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. “పాకిస్తాన్ లో అవినీతి ఎంతలా పేరుకుపోయిందో, పాసుపోర్టు విలువ కూడా అంతే విధంగా పెరిగిపోయిందని, అందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ధన్యవాదాలు. ఇక ఈ దేశంలో మిగిలించి ఏమిటో?” అంటూ ఆ దేశ పౌరుడొకరు వ్యంగ్యంగా స్పందించారు.

Also read: Pongal in AP: వేటపాలెంలో అలరిస్తున్న పడవల పోటీలు

ప్రపంచ దేశాల్లో మానవహక్కుల ఉల్లంఘన, ప్రజల స్వేచ్ఛ, దేశంలో శాంతిభద్రతలు, ఆహారం సరఫరా వంటి ప్రాధమిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయిస్తుంది హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ సంస్థ. ఒక దేశానికి చెందిన పాసుపోర్టుపై ముందస్తు వీసా లేకుండా ఇతర దేశాలకు వెళ్లగలిగే సామర్ధ్యాన్ని ఈ ర్యాంకులు నిర్ణయిస్తాయి. ఇక 2022కి గానూ భారత దేశ పాసుపోర్టు విలువ 90 నుంచి ఆరు స్థానాలు పెరిగి 84కు చేరింది. దక్షిణాసియాలో అత్యంత విలువైన పాసుపోర్టుగా మాల్దీవ్స్ 58వ స్థానంలో నిలిచింది. మన ఇరుగుపొరుగు దేశాలైన శ్రీలంక దేశ పాసుపోర్టు విలువ 102వ స్థానంలో ఉండగా, బాంగ్లాదేశ్ పాసుపోర్టు విలువ 103వ స్థానంలో నిలిచింది.

Also read: Balayya Sankranthi: కారంచేడులో బాలయ్య సంక్రాంతి సంబరాలు

×