Y.V Subba Reddy: ఒకరిని తొక్కేసి మరొకరిని ఆశీర్వదించాల్సిన అవసరం మాకు లేదు

తమకు ఎవ్వర్ని తొక్కేయాల్సిన అవసరం లేదని... మరోకర్ని పైకి తీసుకొచ్చి ఆశ్వీరదీయాల్సిన అవసరం మాకు లేదని టీటీడీ చైర్మన్, వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Y.V Subba Reddy: ఒకరిని తొక్కేసి మరొకరిని ఆశీర్వదించాల్సిన అవసరం మాకు లేదు

Subbareddy

Y.V Subba Reddy: తమకు ఎవ్వర్ని తొక్కేయాల్సిన అవసరం లేదని… మరోకర్ని పైకి తీసుకొచ్చి ఆశ్వీరదీయాల్సిన అవసరం మాకు లేదని టీటీడీ చైర్మన్, వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిరంజీవికి రాజ్యసభ సీటు అంటూ వచ్చిన ప్రచారాలపై స్పందించారు. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకే చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ వచ్చిన ఊహాగానాలను సుబ్బారెడ్డి కొట్టిపారేశారు. ఒకరిని ఆశీర్వదించి పైకి తీసుకొచ్చి, మరొకరిని తొక్కేసే అవసరం తమకు లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సిఎం జగన్ పాలనను చూసి ప్రజలు భ్రహ్మరధం పడుతున్నారని..పార్టీకోసం ఎవరు కస్టపడ్డారో పార్టీకి ఎవరు అవసరమో వారిని గుర్తించి పదువలు ఇస్తున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Also read: Pongal in AP: వేటపాలెంలో అలరిస్తున్న పడవల పోటీలు

తిరుమలలో భక్తుల నిరసనపై స్పందన:
తిరుమల దేవస్థానంలో గురువారం నాడు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులు తెలిపిన నిరసన పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వీఐపీలకు త్వరగా దర్శనం పూర్తి చేసి, సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని, ఈక్రమంలో రెండు గంటలు ఆలస్యమై భక్తులు కొంత నిరాశ చెందారని సుబ్బారెడ్డి అన్నారు. చరిత్రలోనే మొదటిసారి భక్తులు క్యూలో నిలబడ్డ రెండు గంటలలోపే వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించామని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామి దర్శనమంటే.. గొడవలు జరిగిన సందర్భాలు ఉండేవని సుబ్బారెడ్డి అన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా వీఐపీలకు త్వరగా దర్శనాన్ని పూర్తిచేసి, సమాన్య భక్తులకు నిదానంగా స్వామి వారి దర్శనం కల్పించినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అయితే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద త్రాగు నీరు, అల్పాహారం అందిచలేని విషయంలో భక్తులు నిరుత్సాహానికి గురయ్యారని, కోవిడ్ నిభందలన ప్రకారం భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని నిలిపివేసినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

Also read: Balayya Sankranthi: కారంచేడులో బాలయ్య సంక్రాంతి సంబరాలు