T20 World Cup 2026 : కొట్టుడే కొట్టుడు.. జింబాబ్వేతో మ్యాచ్ వేళ ఇషాన్, సంజూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చూశారా.. వీడియో వైరల్
T20 World Cup 2026 : టీమిండియా ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఎక్కువసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ భారీ షాట్లు ప్రాక్టీస్ చేశారు.
T20 World Cup 2026
- రేపు భారత్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్
- నెట్స్‌లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేసిన ఇషాన్, శాంసన్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8లో భాగంగా గురువారం (26వ తేదీ) రాత్రి చెన్నై వేదికగా ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సూపర్ -8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా.. సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలంటే.. జింబాబ్వే జట్టుపై భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. దీంతో టీమిండియా ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఎక్కువసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.
Also Read : T20 worldCup 2026 : టీమిండియాకు బిగ్‌షాక్.. కీలక మ్యాచ్ సమయంలో జట్టును వీడిన విధ్వంసకర బ్యాటర్
చెన్నై వేదికగా జింబాబ్వే జట్టుతో జరిగే మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో మొదటి బ్యాటింగ్ చేస్తే భారీ పరుగులు చేయాలని టీమిండియా బ్యాటర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా ఇసాన్ కిషన్, సంజు శాంసన్ లు నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో సంజూ, ఇషాన్ భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.
View this post on Instagram
