ACTIVE COVID CASES : 8 రాష్ట్రాల్లో 1లక్షకు పైగా యాక్టివ్ కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతోంది. వారం క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. గత వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది.
- venkaiahnaidu
- Published On : May 20, 2021 / 08:14 PM IST
Active Covid Cases
ACTIVE COVID CASES దేశంలో కరోనా వైరస్ విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతోంది. వారం క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. గత వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది. రోజూ రెండు లక్షలకుపైగా మూడు లక్షలకు తక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో 2,76,070 కొత్త కోవిడ్ కేసులు,3874మరణాలు నమోదయ్యాయి.
ఇక, దేశంలో ఎనిమిది రాష్ట్రాలలో ఇప్పుడు 1 లక్షకు పైగా యాక్టివ్ కరోనా వైరస్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో 5,58,911 కేసులు ఉండగా, మహారాష్ట్రలో 4,04,229 కేసులు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం 31,29,878 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
ఇక, 9 రాష్ట్రాల్లో 50,000-1లక్ష మధ్యలో యాక్టివ్ కేసులు ఉన్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు. 19 రాష్ట్రాల్లో 50,000కన్నా తక్కువ యాక్టివ్ కేసులున్నాయని చెప్పారు. 22 రాష్ట్రాల్లో 15% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉందన్నారు. 7 రాష్ట్రాల్లో 25శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉందన్నారు.
