Heavy Rain Alert: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఈ 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
దేశంలోని పలు రాష్ట్రాలు వర్ష (Heavy Rain Alert)తీవ్రత తగ్గే సూచనలు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో ఆందోళన పెరిగింది
- V Santhosh Kumar
- Updated on- July 25, 2026 / 10:44 PM IST
imd heavy rainfall red alert and floods warning for multiple states
- భారీ వర్షాల హెచ్చరిక
- తీవ్రమైన అల్పపీడనాల ప్రభావం
- ఆకస్మిక వరదల ముప్పు
Heavy Rain Alert: నైరుతి రుతుపవనాల విలయతాండవంతో దేశంలోని పలు రాష్ట్రాలు తీవ్ర భయాందోళనల నడుమ కాలం గడుపుతున్నాయి. రాబోయే రోజుల్లో వర్ష(Heavy Rain Alert) తీవ్రత ఏమాత్రం తగ్గే సూచనలు కనిపిస్తే లేవని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. పశ్చిమ విక్షోభం, అల్పపీడనాలు జతకట్టడంతో భానుడి తాపానికి విరామం లభించినప్పటికీ, ఆకస్మిక వరదలు, ఈదురుగాలుల ముప్పు ముంచుకొస్తోంది. రాబోయే 24 గంటల్లో ప్రజలు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన అల్పపీడనాలు: పలు జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు:
భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కొంకణ్-గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే గుజరాత్‌లోని సంతల్‌పూర్‌లో రికార్డు స్థాయిలో 390 మిమీ వర్షపాతం నమోదైంది. నైరుతి రాజస్థాన్, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, రుతుపవన ద్రోణితో తోడవ్వడంతో ఏపీ, తెలంగాణ, హిమాచల్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సౌరాష్ట్ర, కచ్, జార్ఖండ్ లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.
