Viral Video: ఎస్పీ చెంప మీద కొడితే.. భద్రతాధికారి కాలుతో తన్నాడు!
ఒకరు జిల్లా ఎస్పీ అయితే.. మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా ఉన్న అదనపు ఎస్పీ. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఇద్దరూ ఏర్పాట్లలో ఉండగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సహనం కోల్పోయిన ఎస్పీ.. సీఎం భద్రతాధికారి మీద చేయి చేసుకొని చెంపచెళ్లుమనిపించాడు.
- Naresh Mannam
- Published on- June 24, 2021 / 12:55 PM IST
Viral Video
Viral Video: ఒకరు జిల్లా ఎస్పీ అయితే.. మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా ఉన్న అదనపు ఎస్పీ. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఇద్దరూ ఏర్పాట్లలో ఉండగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సహనం కోల్పోయిన ఎస్పీ.. సీఎం భద్రతాధికారి మీద చేయి చేసుకొని చెంపచెళ్లుమనిపించాడు. ఇది చూసిన సీఎం భద్రతాసిబ్బందిలోని మరో అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఎస్పీని కాలుతో తన్నుతూ నెట్టేశాడు. టీనేజ్ కుర్రాళ్ళ స్ట్రీట్ ఫైట్ లా కనిపించిన ఈ అధికారుల గొడవ హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పర్యటన సమయంలో ఫోర్ లేన్ ప్రభావిట్ కిసాన్ సంఘ్ సభ్యులు భున్తర్ విమానాశ్రయం బయట గుమికూడారు. ఈ విషయమై సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేస్తూ కులు ఎస్పీ గౌరవ్ సింగ్‌ను నిలదీశారు. మాటామాటా పెరిగి సహననం కోల్పోయిన గౌరవ్ సింగ్ సీఎం భద్రతా సిబ్బందిలోని అదనపు ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్ సూద్‌ను చెంపదెబ్బ కొట్టాడు.
సీఎం సెక్యూరిటీ సిబ్బంది అందరూ కలిసి ఎస్పీ మీద వాదనకు దిగగా మరో సెక్యూరిటీ ఆఫీసర్ బల్వంత్ సింగ్.. ఎస్పీ గౌరవ్సింగ్ను కాలితో తన్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారగా ఇప్పటికే విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ముగ్గురినీ విధుల నుండి తప్పించి సెలవుపై పంపారు. వారి స్థానంలో అదనపు అధికారులకు బాధ్యతలు అప్పగించి ఎవరిదో తప్పో తేల్చే పనిలో ఉన్నారు.
