హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని.. మరికొద్ది వారాలపాటు లాక్‌డౌన్ పొడిగించే నిర్ణయం తీసుకుంది. ఇంకో ఐదు వారాల పాటు పొడిగిస్తామని అధికార పార్టీ బీజేపీ నాయకులు జై రామ్ ఠాకూర్ ప్రకటించారు. జూన్ 30వరకూ హిమాచల్ ప్రదేశ్ లోని 12 జిల్లాల్లో లాక్‌డౌన్ పొడిగిస్తామని అన్నారు.
రాష్ట్రంలో 214కరోనా కేసులు నమోదుకాగా, 63మంది రికవరీ అయి 5మంది చనిపోయారు. అందులో నాలుగో వంతు కేసులు హమీర్‌పూర్ జిల్లాలోనే నమోదయ్యాయి. 63కేసులు తో హమీర్‌పూర్ టాప్‌లో ఉంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలు లాక్ డౌన్ ను సడలిస్తుంటే హిమాచల్ ప్రదేశ్ ఒక్కటే పొడిగించింది. కేంద్రం కూడా విమాన ప్రయాణాలను పునరుద్ధరించింది.
దేశం మొత్తంలో మహారాష్ట్రలో అత్యధిక కేసులు ఉండటంతో అక్కడ కూడా లాక్ డౌన్ పొడిగించే ప్లాన్ లో ఉన్నారు. మే31 వరకూ లాక్ డౌన్ పొడిగించడానికి డెడ్ లైన్. ప్రభుత్వం దీనిని మూడు సార్లు పొడిగిస్తూ వచ్చారు. తొలిసారిగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మార్చి 25నే ప్రకటించారు.
ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగిస్తామని ప్రధాని చెప్పిన మాటకు మద్దతు ఇచ్చారు. సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ లో అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను మొదలుపెట్టడానికి సపోర్ట్ చేశారు. రాష్ట్రంలో ఇంటింటికి తిరికి 16వేల మంది సిబ్బందితో టెస్టులు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం.