Veerappan Daughter : వీరప్పన్ ఉండే అడవుల్లో భారీగా నిధుల డంప్
చందనపు దొంగ వీరప్పన్ ఉండే సత్యమంగళం అడవుల్లో భారీ నిధుల డంప్ ఉన్నట్లు ఆయన కుమార్తె విజయలక్ష్మి పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.
- madhu
- Published On : April 11, 2021 / 09:48 AM IST
Veerappan
Vijayalakshmi : చందనపు దొంగ వీరప్పన్ ఉండే సత్యమంగళం అడవుల్లో భారీ నిధుల డంప్ ఉన్నట్లు ఆయన కుమార్తె విజయలక్ష్మి పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. వాల్మురిమై కట్చిలో ఉంటున్న ఈమె రన్ పిళ్లై సినిమాలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా.. చెన్నైలో చిత్ర యూనిట్ తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు తండ్రి వీరప్పన్ అంటే ఎంతో అభిమానం, ఇష్టమన్నారు. సత్యమంగళం అడవుల్లోనే అత్యధిక కాలం జీవించారని గుర్తు చేశారామె. ఈ అడవుల్లో తన తండ్రి దాచిపెట్టిన అతిపెద్ద నిధి ఉందని, దీనిని కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిధి గురించి తెలిసిన తన తండ్రి, ఆయన అనుచరుడు ఈ లోకంలో లేరని…ఆ నిధి ఎక్కడుందో ప్రశ్నార్థకమేనన్నారు.
వవీరప్పన్ విషయానికి వస్తే..భార్య ముత్తు లక్ష్మి, విద్యారాణి, విజయలక్ష్మి కుమార్తెలున్నారు. విద్యారాణి బీజేపీలో చేరి మహిళా యువజన నేతగా ఉన్నారు. తమిళనాడు, కర్నాటక పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. సత్యమంగళం అడవులను స్థావరంగా చేసుకుని చందనపు దుంగలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్ లో రాజ్యమేలిన సంగతి తెలిసిందే. 2004లో జరిగిన ఎన్ కౌంటర్ లో పోలీసుల చేతిలో హతమయ్యాడు. వీరప్పన్ స్మగ్లింగ్ సామాజ్రం అంతమైనా..తరచూ వీరప్పన్ పేరు మాత్రం వార్తల్లోనే ఉంటూ వస్తోంది.
Read More : Telangana Corona : సాయంత్రం 6.30 గంటల వరకే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాలు
