×
Ad

Divorce: కుక్కలు ఎంత పని చేశాయి..! విడాకులు ఇప్పించాలంటూ.. కోర్టును ఆశ్రయించిన భర్త..

భార్య తీరు భర్తకు అస్సలు నచ్చేది కాదు. నీ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నా అని వాపోయాడు.

Divorce: కుక్కలు ఓ సంసారంలో చిచ్చు రాజేశాయి. శునకాల కారణంగా ఆ దంపతుల మధ్య పెద్ద గొడవే జరిగింది. మ్యాటర్.. ఏకంగా విడాకుల వరకు వెళ్లింది. తాను ఎంత చెప్పినా వినకుండా తన భార్య తరచూ వీధి కుక్కలను ఇంటికి తీసుకొస్తోందని, ఇక ఆమెతో కలిసి జీవించలేనని, తనకు విడాకులు ఇప్పించాలని ఓ వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు.

దంపతులు అహ్మదాబాద్ లో నివాసం ఉంటారు. 2006లో వారి వివాహం జరిగింది. మొదట్లో వీరి కాపురం బాగానే సాగింది. అయితే, కుక్కలంటే భార్యకు ఎంతో ప్రేమ. అదే వారి సంసారంలో చిచ్చు రాజేసింది. వీధి కుక్కలపై ప్రేమతో వాటిని ఆమె ఇంటికి తీసుకొచ్చేది. వాటిని బాగా చూసుకునేది. అంతేకాదు.. శునకాలను తన బెడ్‌పైనే పడుకోనిచ్చేది. ఈ క్రమంలో అతడు భార్య దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కుక్కలు మొరిగేవి. అంతేకాదు ఓసారి కుక్క భర్తను కరిచింది కూడా. దీంతో కుక్కలను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాలని భార్యను కోరాడు భర్త. కానీ, ఆమె అతడి మాట వినలేదు. ఇంత జరిగినా.. కుక్కలను మాత్రం విడిచి పెట్టలేదు.

అంతేకాదు.. తన భార్య ఒక జంతు సంక్షేమ సంఘంలో చేరి, తనను బెదిరించడానికి జంతువులను వేధిస్తున్నానని తనపై ఫిర్యాదులు చేయడం ప్రారంభించిందని, దాంతో పరిస్థితి మరింత దిగజారిందని భర్త గోడు వెళ్లబోసుకున్నాడు. భార్య తీరు భర్తకు అస్సలు నచ్చేది కాదు. నీ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నా అని వాపోయాడు. కుక్కలను ఇంటికి తీసుకురావొద్దని ఆమెను వేడుకున్నాడు. కానీ, ఆమె వినలేదు. దీంతో ఇద్దరి మధ్య వివాదం పెరిగి పెద్దదైంది.

భార్య తీరుతో విసిగిపోయిన భర్త కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తనకు విడాకులు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య తీరుతో తాను ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యాయని వాపోయాడు. ఆమె పెట్టిన ఒత్తిడితో తనకు డయాబెటిస్ వచ్చిందన్నాడు. అది అంగస్తంభన సమస్యకు దారితీసిందని.. దాంతో తన భార్య తనను ఎగతాళి చేసేదని వాపోయాడు. ఇలాంటి వ్యక్తితో తానిక సంసారం చేయలేనని ఆ భర్త కోర్టులో తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇద్దరికీ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.

Also Read: లాలూ కుటుంబంలో ఓటమి చిచ్చు.. కూతురు సంచలన నిర్ణయం..