Software Employee : భార్యతో గొడవ.. ఓ కారు, నాలుగు బైకులకు నిప్పుపెట్టిన ఐటీ ఉద్యోగి.
భార్యపై కోపంతో నాలుగు బైకులు, ఓ కారుకు నిప్పు పెట్టాడో ఓ వ్యక్తి. ఈ ఘటన నెర్కుండ్రంలో గతనెల 25న జరిగింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించాయి.
- kunduru Vinod
- Updated on- October 1, 2021 / 08:06 AM IST
Software Employee
Software Employee : తమిళనాడు, చెన్నైలో భార్యపై కోపంతో నాలుగు బైకులు, ఓ కారుకు నిప్పు పెట్టాడో ఓ వ్యక్తి. ఈ ఘటన నెర్కుండ్రంలో గతనెల 25న జరిగింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించాయి. ఘటన స్థలిని పరిశీలించిన పోలీసులు.. అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు చేశారు. అక్కడ అగ్నిప్రమాదం జరిగే అవకాశమే లేదు. దగ్గర్లో విద్యుత్ వైర్లు కూడా లేవు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపారు. ఇది అగ్నిప్రమాదం కాదని, కావాలనే నిప్పు పెట్టారని గుర్తించి, నిందితుడి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు.
Read More : TTD : నిరాశగా వెనుదిరుగుతున్న శ్రీవారి భక్తులు, ఎందుకో తెలుసా ?
స్థానికంగా నివాసం ఉండే సతీష్ (26) అనే వ్యక్తి వాహనాలకు నిప్పు పెట్టినట్లు నిర్ధారణకు వచ్చి అరెస్ట్ చేశారు. కాగా అంబత్తూరు ఐటీ కంపెనీలో పని చేస్తున్న సతీష్ 2019 నుంచి భార్య వెండామనితో విడిపోయాడు. ఈ తరుణంలోనే భార్య తరచూ ఫోన్ చేసి సతీష్ ని విసిగిస్తోంది. దీంతో విరక్తి చెందిన సతీష్ భార్య వాహనానికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు పెద్దగా వ్యాపించి పక్కనే ఉన్న వాహనాలకు అంటుకున్నాయి. దీంతో నాలుగు బైకులు, ఒక కారు పూర్తిగా కాలిపోయింది. కాగా ఈ విష యం స్థానికంగా సంచలనం కలిగించింది.
Read More : Mancherial : రోడ్డు ప్రమాదం.. కలెక్టర్ గన్‌మెన్ మృతి
