TTD : నిరాశగా వెనుదిరుగుతున్న శ్రీవారి భక్తులు, ఎందుకో తెలుసా ?

సామాన్య భక్తులు కూడా కొనుగోలు చేసే విధంగా వెండి, రాగి డాలర్లను విక్రయిస్తోంది టీటీడీ. డాలర్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళితే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

TTD : నిరాశగా వెనుదిరుగుతున్న శ్రీవారి భక్తులు, ఎందుకో తెలుసా ?

Ttd Dollars

Dollars In Srivari Temple : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించుకున్న భక్తులు.. తిరుమల నుండి శ్రీవారి ప్రసాదాలు, చిత్ర పటాలు తీసుకెళ్లడం ఆనవాయితీ. అయితే ఆర్థిక స్తోమత కలిగిన భక్తులు తిరుమలలో బంగారం డాలర్లను కూడా కొనుగోలు చేయడానికి టీటీడీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. శ్రీవారి హుండీలో భక్తులు కానుకగా సమర్పించే బంగారాన్ని ముంబైలోని మింట్ ద్వారా కరిగించి శ్రీవారు, పద్మావతి అమ్మవారి చిత్రాలు ఉండేలా డాలర్లను రూపొందిస్తారు. 10, 5, 2 గ్రాములు బరువుతో టీటీడీ ఈ డాలర్లను తయారు చేస్తోంది.

Read More : Mumbai Ex-Top Cop : రష్యాకి పారిపోయిన పరమ్ బీర్ సింగ్!

వాటిని ఆరోజు బంగారం మార్కెట్ విలువకు భక్తులకు విక్రయిస్తారు. బంగారం డాలర్లతో పాటు సామాన్య భక్తులు కూడా కొనుగోలు చేసే విధంగా వెండి, రాగి డాలర్లను విక్రయిస్తోంది టీటీడీ. ఆలయం ఎదురుగా ఉన్న కౌంటర్‌ ద్వారా 10, 5, 2 గ్రాములు బంగారం డాలర్లు, 50, 10, 5 గ్రాములు వెండి, రాగిలో 10, 5 గ్రాముల డాలర్లను విక్రయిస్తుంటారు. శ్రీవారి డాలర్లు కావడంతో వాటిని సెంటిమెంట్‌గా కొనుగోలు చేస్తారు భక్తులు. పద్మావతి అమ్మవారు శ్రీనివాసులు డాలర్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళితే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

Read More : Ola Electric పంట పండింది.. మ‌రో 200 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబడులు

టీటీడీ కౌంటర్లలో గత కొన్ని నెలలుగా బంగారం డాలర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం కేవలం 10 గ్రాముల బంగారం డాలర్లు, 10 గ్రాముల రాగి డాలర్లు మాత్రమే దొరుకుతున్నాయి. మిగిలినవి అందుబాటులో లేవు. ప్రస్తుతం మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర 45 వేల రూపాయల వరకూ ఉంటోంది. అంతా భారీ విలువ ఉండే 10 గ్రాముల బంగారు డాలర్లను కొనుగోలు చేసే స్తోమత అందరికీ ఉండదు. 5 గ్రాములు 2 గ్రాములు డాలర్లు అందుబాటులో ఉంటే మరికొంత మంది భక్తులు డాలర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. తక్కువ ధర ఉండే డాలర్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది భక్తులు నిరాశతో వెళుతున్నారు.