Abhinandan Varthaman : బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హీరోకి ప్రమోషన్
బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హీరో, వీర్ చక్ర అవార్డు గ్రహీత అభినందన్ వర్థమాన్ కు ప్రమోషన్ దక్కింది. ఏస్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు
- venkaiahnaidu
- Published On : November 3, 2021 / 06:20 PM IST
Abhi
Abhinandan Varthaman బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ హీరో, వీర్ చక్ర అవార్డు గ్రహీత అభినందన్ వర్థమాన్ కు ప్రమోషన్ దక్కింది. ఏస్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ కు ప్రమోట్ చేసినట్లు భారత వైమానిక దళం (IAF) బుధవారం ప్రకటించింది.
గ్రూప్ కెప్టెన్ అంటే..ఇండియన్ ఆర్మీలో కల్నల్‌తో సమానం. త్వరలోనే అభినందన్ వర్థమాన్ కొత్త ర్యాంక్‌ను పొందబోతున్నాడని ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. కాగా, 2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై ఐఏఎఫ్ జరిపిన వైమానిక దాడిలో అభినందన్ వర్థమాన్ ది కీలక పాత్ర.
బాలాకోట్ దాడుల సమయంలో అభినందన్ ను అదుపులోకి తీసుకున్న పాక్ ఆర్మీ..భారత్ హెచ్చరికతో రోజుల వ్యవధిలోనే అతడిని విడుదల చేసిన విషయం తెలిసిందే. బాలాకోట్ దాడుల సమయంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్ కు గతేడాది శౌర్య చక్ర అవార్డు లభించింది.
ALSO READ Rahul Letter To SRK : దేశం మీ వెంటే..షారుఖ్ ఖాన్ కు రాహుల్ లేఖ
