Tina Dabi: ఐఏఎస్ టాపర్ టీనా దాబికి రెండో పెళ్లి.. మళ్లీ ఐఏఎస్‌తోనే
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) ఆఫీసర్ టీనా దాబి రెండోసారి పెళ్లీ పీటలు ఎక్కునున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే వరుడు ప్రదీప్ గవాండెతో దిగిన ఫొటోలను షేర్ చేశారు.
- Subhan Ali Shaik
- Published On : March 29, 2022 / 08:44 PM IST
Tina Dabi
Tina Dabi: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) ఆఫీసర్ టీనా దాబి రెండోసారి పెళ్లీ పీటలు ఎక్కునున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే వరుడు ప్రదీప్ గవాండెతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ను పెళ్లాడనున్నట్లు ప్రకటించారు.
దాబి 2015 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో టాప్ గా నిలిచి మొదటిసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత అతార్ ఆమీర్ యూఐ షఫీ ఖాన్ ను పెళ్లాడారు. షఫీ ఖాన్ 2015 ఐఏఎస్ ఎగ్జామ్స్ లో సెకండ్ వచ్చిన వ్యక్తి. పెళ్లైన కొన్నేళ్లకు అంటే 2021లో విడాకులు తీసుకుని ఆ బంధానికి గుడ్ బై చెప్పేశారు. అలా జరిగిన ఏడాదికి గవాండెను వివాహమాడనున్నట్లు టీనా ప్రకటించడం విశేషం.
వృత్తిరీత్యా డాక్టర్ అయిన ప్రదీప్ గవాండె ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ప్రస్తుతం ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, రాజస్థాన్ కు డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తన కంటే 13ఏళ్ల చిన్నదైన టీనా దాబిని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు.
Read Also : రెండేళ్లకే విడాకులు తీసుకున్న IAS టాపర్లు
దళిత కమ్యూనిటీ నుంచి టాపర్ గా నిలిచిన తొలి వ్యక్తిగా నిలిచింది టీనా దాబి. తొలి వివాహం గురించి దాబి, ఖాన్ ఫేస్ బుక్ ద్వారా తమ రిలేషన్ ను 2016లో ప్రకటించారు. అలా రెండేళ్ల ప్రయాణం తర్వాత 2018లో పెళ్లి చేసుకుని 2020లో విడిపోతున్నట్లు కన్ఫామ్ చేసేశారు.
Tina Dabi First Marriage
