IED Blast : మణిపూర్‌లో ఐఈడీ పేలుడు
మణిపూర్‌లో ఐఈడీ పేలుడు కలకలం సృష్టించింది. రాజధాని ఇంపాల్ సమీపంలోని ఓ గోడౌన్ గేటు వద్ద ఐఈడీ పేలుడు జరిగింది.
- kunduru Vinod
- Published On : December 29, 2021 / 11:32 AM IST
Ied Blast
IED Blast : మణిపూర్‌లో ఐఈడీ పేలుడు కలకలం సృష్టించింది. రాజధాని ఇంపాల్ సమీపంలోని ఓ గోడౌన్ గేటు వద్ద ఐఈడీ పేలుడు జరిగింది. పేలుడు విషయం తెలియడంతో స్థానిక పోలీసులు ఘటన స్థలికి చేరుకొని తనిఖీ చేశారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో సమీపంలో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
చదవండి : Blast Inside Ludhiana Court : లుథియానా కోర్టులో పేలుడు..ఇద్దరు మృతి,నలుగురికి తీవ్ర గాయాలు
ఇక ఐఈడీ పేలుడు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. పేలుడు విషయాన్నీ బీఎస్ఎఫ్ అధికారులకు చేరవేసినట్లు పోరంపట్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్, ఖైలెట్ లంఘల్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం వచ్చి ఈ విషయంపై దర్యాప్తు చేస్తోందని తెలిపారు. పేలుడు దాటికి గోడౌన్ గేట్లు ధ్వంసమైనట్లు తెలిపారు లంఘల్.
చదవండి : Tesla Car Blast With Dynamite : టెస్లా కంపెనీపై కోపం..కోటికి పైగా విలువచేసే కారును పేల్చేసిన యజమాని
