Tesla Car Blast With Dynamite : టెస్లా కంపెనీపై కోపం..కోటికి పైగా విలువచేసే కారును పేల్చేసిన యజమాని

టెస్లా కంపెనీపై కోపంతో ఓ వ్యక్తి కోటి రూపాయల విలువ చేసి కారును పేల్చేశాడు. ఇందుకోసం 30 కేజీల డైనమైట్ స్టిక్స్ వాడాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది

Tesla Car Blast With Dynamite : టెస్లా కంపెనీపై కోపం..కోటికి పైగా విలువచేసే కారును పేల్చేసిన యజమాని

Tesla Car Blast With Dynamite

Tesla Car Blast With Dynamite : ప్రపంచ మార్కెట్లో టెస్లా కార్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తమ కార్లకు కొత్త టెక్నాలజీ జోడిస్తూ వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తుంది ఈ కంపెనీ. మంచి ఫీచర్లు ఉన్నప్పటికి కొన్ని విషయాల్లో టెస్లా కార్లు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. డ్రైవర్ లెస్ కార్లు సడన్‌గా ఆగిపోతుండగా, మరికొన్ని కార్లు సర్వీసు సమయానికి ముందే షెడ్డుకు తీసుకెళ్లాల్సి వస్తుంది.

చదవండి : Tesla Car: టెస్లా కారు నుంచి మంటలు.. దగ్ధమైన ఇల్లు

అయితే టెస్లా కారును కొనుగోలు చేసిన దక్షిణ ఫిన్‌లాండ్‌లోని కైమెన్‌లాక్సోకి చెందిన ట్యుమ‌స్ అనే వ్య‌క్తికి చుక్క‌లు చూపించింది. మొద‌టి 1500 కిలోమీట‌ర్లు చాలా అద్భుతంగా ప్రయాణించిన కారు ఆ త‌రువాత ఆటోమేష‌న్ సిస్ట‌మ్ ఎర్ర‌ర్ చూపించింది. దీంతో ట్యుమస్ కారును టెస్లా స‌ర్వీస్ షోరూమ్‌కి తీసుకెళ్లాడ‌ట‌. అయితే అక్కడ సర్వీసింగ్ ఖర్చులు 20000 యూరోలు(17 లక్షలు) అవుతుందని చెప్పారంట షోరూమ్ నిర్వాహకులు. అంతమొత్తం పెట్టడం ఇష్టం లేని ట్యుమ‌స్ మంచుతో కప్పబడిన జాలా అనే ప్రాంతంలో కారును పేల్చేశాడు.

చదవండి : Tesla: టెస్లాకు వెయ్యి కోట్ల జరిమానా.. కాస్త కరుణ చూపాలంటున్న ఎలన్ మస్క్

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా జనావాస ప్రాంతాల నుంచి చాలా దూరం వెళ్లి జాలా అనే ప్రాంతం వద్ద కారుకు 30 డైనమైట్ స్టిక్స్ అమర్చి పేల్చేశారు. ఇక ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సభ్యులను పిలిపించాడు ట్యుమస్. ఈ పేలుడు దృశ్యాలను యూట్యూబ్ ఛానల్ కెమెరాలు చిత్రించాయి. పేలుడు దాడికి కారు ముక్కలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు అనంతరం హెలికాప్టర్ పై నుంచి టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ బొమ్మను కిందకు విసిరేశారు. సుమారు కోటి రూపాయల విలువైన టెస్లా 2013ని ఇలా పేల్చడం చర్చనీయాంశంగా మారింది.