Tesla Car: టెస్లా కారు నుంచి మంటలు.. దగ్ధమైన ఇల్లు

పెన్సిల్వానియాలోని ఒక ఇంట్లో పార్కింగ్ చేసి ఉన్న టెస్లా కార్ కు అగ్ని ప్రమాదం జరిగింది. వెనుక చక్రంలో నుంచి మంటలు చెలరేగి గ్యారేజికి అంటుకోవడంతో ఇంటికి నిప్పంటింది. అరగంటలోనే ..

Tesla Car: టెస్లా కారు నుంచి మంటలు.. దగ్ధమైన ఇల్లు

Tesla Car In Fire

Tesla Car: ఫ్యామస్, అడ్వాన్స్‌డ్ ఆటోపైలట్ లేదా రిమోట్ డ్రైవింగ్ ఫీచర్లు ఉన్న టెస్లా కార్ కు ప్రమాదం జరిగింది. ఆటో పైలట్ మోడ్ తో సూపర్ పాపులర్ అయిన టెస్లా కారులో సాధారణంగా డ్రైవర్ సీట్ లో ఉన్నప్పుడే ఈ ఫీచర్ వాడుకోమంటూ సూచిస్తున్నారు. ఇన్ని పాజిటివ్ బెనిఫిట్స్ ఉన్న మోడల్ లో.. నెగెటివ్ ఘటనలు కూడా నమోదువుతున్నాయి.

ఫైర్ డిపార్ట్‌మెంట్ ఘటనాస్థలానికి వచ్చి ప్రమాద తీవ్రతను తగ్గించారు. పెన్సిల్వానియాలోని ఒక ఇంట్లో పార్కింగ్ చేసి ఉన్న టెస్లా కార్ కు అగ్ని ప్రమాదం జరిగింది. వెనుక చక్రంలో నుంచి మంటలు చెలరేగి గ్యారేజికి అంటుకోవడంతో ఇంటికి నిప్పంటింది. అరగంటలోనే అదుపుచేయడంతో ప్రాణ నష్టం జరగలేదు. కేవలం వస్తువులు మాత్రమే కాలిపోయాయని యజమాని చెప్పారు.

తగులబడిన కారు ఆ ఇంటి ఫొటోలను ఫైర్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసింది. ‘నవంబర్ 23 మంగళవారం రాత్రి 10గంటల 19నిమిషాలకు ఇంటికి నిప్పంటింది. సిబ్బంది వెళ్లి ఆ ఎలక్ట్రిక్ కారు మంటలను అదుపుచేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రాణాపాయం తప్పింది’ అని వాషింగ్టన్ ఫైర్ కంపెనీ ఫేస్‌బుక్‌లో వివరించింది.

………………………………………. : వేలంలో రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయిన రూపాయి నాణెం

కొద్దిసేపటి క్రితం, ఒక టెస్లా మోడల్ S ప్లాయిడ్ క్యాచ్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ సకాలంలో వాహనం నుండి దూకేయడంతో ఫాక్స్ బిజినెస్ నివేదిక ప్రకారం ఘటనకు మూడు రోజుల ముందే కారు కొనుగోలు చేశారు. మంటలు చెలరేగిన సమయంలో 40 అడుగుల మేర కారు ముందుకు కదిలిందని అధికారులు చెబుతున్నారు.,