One Rupee Coin : వేలంలో రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయిన రూపాయి నాణెం

ఒక రూపాయి నాణెం వేలంపాటలో రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయిది. ఒక రూపాయి నాణేన్ని వేలం వేస్తే రూ.2.5 లక్షలు పలికింది. అర్ధ రూపాయి నాణేన్ని వేలం వేస్తే రూ.60వేలు పలికింది.

One Rupee Coin : వేలంలో రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయిన రూపాయి నాణెం

One Rupee

One Rupee coin at auction : ఒక రూపాయి నాణెం వేలంపాటలో రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయిది. ఒక రూపాయి నాణేన్ని వేలం వేస్తే రూ.2.5 లక్షలు పలికింది. అర్ధ రూపాయి నాణేన్ని వేలం వేస్తే రూ.60వేలు పలికింది. నోట్లపై 786 సిరీస్‌ ఉంటే దాని విలువకు అనేక రెట్ల ధర పలుకుతుంది. ‘ఇండియా కాయిన్‌ మిల్‌’ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో పాత నాణేలు, నోట్లను వేలం వేస్తోంది.

1985లో ముద్రించిన ఒక్క రూపాయి నాణేన్ని ఇటీవల వేలం వేస్తే రూ.2.5 లక్షలు ధర పలికింది. ఇలాంటివి చాలా ఉన్నాయని పాత నాణేల కోసం వెతుకుతున్నారా? అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్‌. 1985లో దేశంలోని నాలుగు మింట్లతోపాటు బ్రిటన్‌లోని లాంట్రిసాంట్‌ అండ్‌ హీటన్‌ మింట్‌లో నాణేలను ముద్రించారు. వాటిపై ప్రత్యేకంగా హెచ్‌ అనే మార్క్‌ను వేశారు. ఏదైనా నాణేన్ని విడుదల చేసేముందు కొన్ని లోహాల మిశ్రమాలతో శాంపిల్‌గా కొన్ని కాయిన్లను ముద్రించి పరీక్షిస్తారు.

Tragedy : చికిత్స చేస్తుండగా గుండె పోటుతో డాక్టర్ మృతి..పేషెంట్ కూడా

1985లో విడుదల చేసిన నాణేలన్నీ రాగి, నికెల్‌ మిశ్రమంతో చేసినవే కావడం గమనార్హం. శాంపిల్‌ కాయిన్లలో కొన్నింటిని పూర్తిగా రాగితో తయారు చేశారు. వాటిని మాత్రం మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. అలాంటి అరుదైన రాగి రూపాయి బిళ్లను వేలం వేస్తే భారీ మొత్తం పలికింది. అలాగే 1957-1963 మధ్య కాలంలో ముద్రించిన ఓ అర్ధ రూపాయి (50 పైసలు) బిళ్ల రూ.60 వేల ధర పలికింది.

దీన్ని పూర్తిగా నికెల్‌తో తయారు చేశారు. దేశంలో 50 పైసల నాణేలను 1957లో ప్రవేశపెట్టారు. ఆ మొదటి బ్యాచ్‌కు చెందిన నాణేలకు ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉందని సంస్థ చెప్తోంది. ఇక, నోట్లపై సిరీస్‌లో చివరన 786 ఉంటే భారీ ధర దక్కించుకోవచ్చట. ఈ పోర్టల్‌లో సేవలు పూర్తిగా ఉచితం.