Tesla: టెస్లాకు వెయ్యి కోట్ల జరిమానా.. కాస్త కరుణ చూపాలంటున్న ఎలన్ మస్క్

జాత్యంహాకర దాడుల వ్యవహారం టెస్లాను చిక్కుల్లో పడేసింది. భారీగా నష్టపోయే పరిస్థితి తెచ్చింది. కోర్టు.. టెస్లాకు ఏకంగా వెయ్యి కోట్ల జరిమానా విధించింది. అంత భారీ మొత్తంలో ఫైన్ వేయడంతో

Tesla: టెస్లాకు వెయ్యి కోట్ల జరిమానా.. కాస్త కరుణ చూపాలంటున్న ఎలన్ మస్క్

Tesla Elon Musk

Tesla : జాత్యంహాకర దాడుల వ్యవహారం టెస్లాను చిక్కుల్లో పడేసింది. భారీగా నష్టపోయే పరిస్థితి తెచ్చింది. కోర్టు.. టెస్లాకు ఏకంగా వెయ్యి కోట్ల జరిమానా విధించింది. అంత భారీ మొత్తంలో ఫైన్ వేయడంతో ఎలన్ మస్క్ అప్రమత్తం అయ్యారు. దీనిపై ఆయన శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించారు. టెస్లా కంపెనీలో జాత్యంహాకర దాడులపై నమోదైన కేసు విషయంలో కోర్టులోని జ్యూరీ బృందం ఇచ్చిన తీర్పుపై పున:పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

Urine : మూత్రం ఎరుపులో రంగులో ఉంటే డేంజర్లో పడ్డట్టేనా…

టెస్లా కంపెనీ ఫ్రీమాంట్‌ ప్లాంట్‌లో ఓవెన్ డియాజ్ అనే నల్లజాతీయుడు 2015 నుంచి 2016 వరకు పనిచేశాడు. ఆ సమయంలో మాజీ కాంట్రాక్ట్ ఎలివేటర్ ఆపరేటర్‌ వైట్‌ అమెరికన్లు తనని నిగ్గర్ (అమెరికన్లు నల్లజాతీయుల్ని వ్యతిరేకించడం) అని ఏడిపించాడు. వర్క్‌ప్లేస్‌లో జాత్యహంకార వ్యంగ్యంగా బొమ్మల్ని గీసారని, బాత్రూమ్ స్టాల్‌లో నల్లజాతియుల్ని దూషించేలా స్లోగన్లు రాశారని, గోబ్యాక్‌ ఆఫ్రికా అంటూ వేధించారని ఆరోపించాడు. జాత్యంహకార వ్యాఖ్యలపై క్షోభకు గురైన ఓవెన్‌ డియాజ్‌ కోర్డును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన కోర్టు అక్టోబర్‌ 4న ఓవెన్‌ డియాజ్‌కు అనుకూలంగా తుది తీర్పు ఇచ్చింది.

Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క

ఈ ఏడాది అక్టోబర్‌ 4న శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ జ్యూరీ సభ్యులు ఇచ్చిన తీర్పులో టెస్లా కాలిఫోర్నియా ఫ్యాక్టరీలో జాత్యహంకార వేధింపులను కంపెనీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లజాతీయుడు ఓవెన్‌ డియాజ్‌కు 137 మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. తాజాగా కోర్టు తీర్పును టెస్లా సవాల్ చేసింది. కోర్టు తీర్పు టెస్లాను అస్థిరపరిచేలా ఉందని, నిర్ణయాన్ని పున:పరిశీలించాలని న్యాయమూర్తిని కోరింది. ప్రత్యామ్నాయంగా న్యాయస్థానం విధించిన 137 డాలర్లు(భారత కరెన్సీలో రూ.10,17,98,67,200.00) మిలియన్ల నష్టపరిహారం కాకుండా300,000 డాలర్లు చెల్లిస్తామని వాదించిందట. అంతేకాదు ఫిర్యాదు దారుడు చేసిన ఆరోపణల‍్లో ఆధారాలు లేవని కోర్టుకి చెప్పినట్టు బ్లూమ్‌ బెర్గ్‌ తెలిపింది.

గత పదేళ్లుగా అగ్రరాజ్యం అమెరికాలో జాత్యంహాకర దాడులు భారీగా పెరిగాయి. గతేడాది జార్జ్‌ ఫ్లాయిడ్‌ గొంతుపై మోకాలు ఉంచి ఓ అమెరికన్‌ పోలీసు అధికారి దాడి చేయడం, జార్జ్‌ఫ్లాయిడ్‌ మరణం అమెరికాలో భారీ ప్రకంపనలనే సృష్టించింది. అమెరికాలో బ్లాక్‌ లైవ్‌మ్యాటర్స్‌ పేరుతో భారీ ఉద్యమమే నడిచింది.