Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క

కామంచి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేదంలో ఇన్‌స్టంట్ ఇమ్యూనిటీ బూస్టర్ గా చెబుతారు. దీంతో వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

Kamakshi Plant  : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క

Kamanchi Plant

Kamakshi Plant : ప్రకృతిలో మానవాళికి ఉపయోగపడే ఎన్నో రకాల ఔషదగుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి. అయితే వాటిని ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. పాతతరం వారు వివిధ రకాల వ్యాధులు వస్తే చుట్టు లభించే మొక్కల ద్వారానే ఔషదాలు తయారు చేసుకుని వారికి వచ్చిన రోగాలను తగ్గించుకునేవారు. అయితే అధునిక సమాజంలో పాత విధనాలను అనుసరించే వారే కరువయ్యారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయేది ఎన్నో ఔషదగుణాలు కలిగిన కామంచి మొక్క గురించి. ఈ మొక్కలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

చిన్నగా, దట్టంగా పెరిగే ఈ కామంచి మొక్క టమాటా జాతికి చెందినది. దీన్నే కామాక్షి చెట్టు అని కూడా అంటారు. మిరప చెట్టులా పెరుగుతుంది. దీనికి చిన్న చిన్న పండ్లు కాస్తాయి. అవి చూసేందుకు అచ్చం చిన్న టమాటా పండ్లలా ఉంటాయి. అయితే కామంచి మొక్క వల్ల మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ మొక్క ఆకులతో మనం లివర్ వ్యాధులను నయం చేసుకోవచ్చు.

కామంచి మొక్క ఆకులు లివర్‌కు టానిక్‌లా పనిచేస్తాయి. అందుకు గాను ఈ మొక్క ఆకులను తెచ్చి దంచి రసం తీయాలి. దాన్ని 20 లేదా 30 ఎంఎల్ మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర పొడి లేదా మిరియాల పొడి కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల లివర్ వ్యాధులు తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్‌, ఆల్కహాలిక్ లివర్ డ్యామేజ్‌, ఇతర కారణాల వల్ల డ్యామేజ్ అయిన లివర్ వంటి సమస్యలు తగ్గుతాయి.

కామంచి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేదంలో ఇన్‌స్టంట్ ఇమ్యూనిటీ బూస్టర్ గా చెబుతారు. దీంతో వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కామంచి మొక్క ఆకుల రసాన్ని పైన చెప్పిన విధంగా సేవించడం వల్ల లివర్ పూర్తిగా బాగుపడుతుంది. ఎంతో హీన దశలో ఉన్న లివర్ కూడా ఆరోగ్యంగా మారుతుంది. లివర్ లోని వ్యర్థాలు బయటకుపోతాయి. లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్ ఇన్ఫెక్షన్లు, కామెర్లు తగ్గుతాయి. అందువల్ల దీన్ని లివర్‌కు అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు.

భారతీయ సైంటిస్టులు ఈ మొక్కకు చెందిన ఆకుల్లో క్యాన్సర్లను తగ్గించే ఔషధగుణాలు ఉన్నాయని తేల్చారు. అందుకు సంబంధించి వారు పేటెంట్ హక్కులను కూడా తీసుకున్నారు. ఇక ఈ మొక్క ఆకుల రసాన్ని పూసినా లేదా వాటి మిశ్రమంతో కట్టు కడుతున్నా.. తేలు కాటు నుంచి విషం హరించుకుపోతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ మొక్క పండ్లు నోటి పూత సమస్యలకు బాగా పనిచేస్తాయి. 20 లేదా 30 పండ్ల ను సేకరించి తింటే రెండు, మూడు రోజుల్లోనే నోటిపూత నుంచి బయట పడవచ్చు. ఈ మొక్క ఆకులను కూరగా వండుకుని తింటే రేచీకటి తగ్గుతుంది. చాలా మంది ఈ ఆకులను పప్పులో వేసుకుని వండుకుంటారు.