Bengaluru: అప్పు గురించి అడిగితే కత్తితో దాడి చేసింది.. ప్రియుడితో కలిసి ఫ్యామిలీ మొత్తాన్ని చెంపేసింది
బెంగళూరు(Bengaluru)లోని కేఆర్ పురం పరిధిలో దారుణమైన ట్రిపుల్ మర్డర్ వెలుగుచూసింది.
- V Santhosh Kumar
- Published on- June 23, 2026 / 08:36 PM IST
In Bengaluru KR Puram a female techie along with her boyfriend murdered her parents and sister over a dispute regarding a loan.
- బెంగళూరులో ట్రిపుల్ మర్డర్.
- కన్నవారిని చంపిన టెక్కి కూతురు.
- ఈఎంఐ అప్పుల వల్లే దారుణం.
Bengaluru: బెంగళూరులోని కేఆర్ పురం పరిధిలో దారుణమైన ట్రిపుల్ మర్డర్ వెలుగుచూసింది. అప్పుల వివాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యువతి, తన లివ్-ఇన్ పార్ట్‌నర్‌తో కలిసి కన్నతల్లిదండ్రులను, చెల్లిని దారుణంగా పొడిచి చంపింది. మృతులను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోమసుందర్ (55), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), చిన్న కుమార్తె సుప్రియ (20)గా గుర్తించారు. సీగేహళ్లి (Bengaluru)ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం అర్థరాత్రి ఈ ఘాతుకం జరిగింది.
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన బెంగళూరు కోర్టు
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సోమసుందర్ పెద్ద కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వీరిద్దరూ వివిధ బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకున్నారు. అయితే, గత కొంతకాలంగా వారు ఈఎంఐలు చెల్లించకపోవడంతో, బ్యాంకు నోటీసులు రామ్మూర్తినగర్‌లోని శ్వేత తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాయి. ఈ ఆర్థిక లావాదేవీలపై, అప్పుల విషయమై మాట్లాడటానికి సోమసుందర్ తన భార్య, చిన్న కూతురితో కలిసి శ్వేత ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన శ్వేత, కెన్నెత్ కలిసి ముగ్గురిపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన ముత్తులక్ష్మి, సుప్రియ ఫ్లాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, సోమసుందర్ రక్తపు మడుగులో మెట్లపైకి పరుగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోగా.. చనిపోయే ముందు సోమసుందర్ కూతురే ఈ పని చేసిందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. నిందితులు ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉండగా, పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
