Corona harsha vardhan
India : కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కీలక సూచనలు చేశారు. ఈ వైరస్ బారిన పడిన వారు చాలా మంది ఇళ్లల్లో కోలుకుంటారని, కంగారు పడి అటూ..ఇటూ పరుగెత్తవద్దని తెలిపారు. కేవలం ఓ ఆరోగ్య మంత్రిగా కాదు..డాక్టర్ గా చెబుతున్నా..భయపడకుండా..హాస్పిటల్స్ కు పరుగెత్తవద్దన్నారు. సరైన అవగాహన లేకుండా..ఆక్సిజన్ తీసుకోవద్దని..అవసరమైన వారు మాత్రమే తీసుకోవాలన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియపై కూడా ఆయన స్పందించారు. ఇప్పటి వరకు రాష్ట్రాలకు 16 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో 15 కోట్ల డోసులు ఇవ్వగా..రాష్ట్రలా దగ్గర మరో కోటి డోసులు ఉన్నాయన్నారు. కొద్ది రోజుల్లో లక్షల వ్యాక్సిన్ డోసులు కూడా పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వివిధ వనరుల నుంచి ఆక్సిజన్ సేకరిస్తున్నట్లు, పరిశ్రమలు, విదేశాల నుంచి సేకరించి..స్టోరేజ్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
మరోవైపు..దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. మరోసారి 3లక్షలకు పైగా కేసులు, 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. 2021, ఏప్రిల్ 28వ తేదీ బుధవారం ఒక్కరోజే ఏకంగా 3 వేల 645మంది కోవిడ్ తో చనిపోయారు. 3 లక్షల 79వేల 257 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524 కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 2,04,832 కి పెరిగింది.
Read More : Remdesivir Injection: రెమ్‌డెసివిర్ కోసం కాళ్లు మొక్కింది.. చివరకు కొడుకును కోల్పోయింది..
We allocate vaccines to states as per their performance in terms of vaccination. We have given more than 16 crore doses of vaccines to states out of which more than 15 crores doses have been administered: Union Health Minister Harsh Vardhan on vaccine shortage in states (1/2) pic.twitter.com/aBPGcWLZyK
— ANI (@ANI) April 29, 2021