India Covid Update : దేశంలో కొత్తగా 67,597 కోవిడ్ కేసులు

నిన్న కొత్తగా 67,597 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

  • Updated on- February 8, 2022 / 12:00 PM IST

India Covid up date

India Covid Update : భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్న కొత్తగా 67,597 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మొన్నటి కేసులతో పోలిస్తే 19.4 శాతం కేసులు తక్కువ గా నమోదయ్యాయి. ఆదివారం దేశంలో 83,876 కేసులు నమోదయ్యాయి.

నిన్న నమోదైన కొత్త కేసులతో కోవిడ్ కేసులు సంఖ్య 4.23,39,611 కు చేరింది. గడిచిన 24 గంటల్లోల 1,188 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దీంతో ఇంతవరకు మరణించిన వారి సంఖ్య 5,04,062 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 9,94,891 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజు వారి పాజిటివిటీ రేటు 7.25 శాతంగా నమోదయ్యింది.