Indian Constitution: అంత దమ్ము మనకు భారత రాజ్యాంగమే ఇచ్చింది.. సీజేఐ చంద్రచూడ్

సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రాజ్యాంగం కల్పించిందన్న విషయాన్ని మరువొద్దు. మనం హక్కుల కోసం మాట్లాడాలి. యువ న్యాయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు రాజ్యాంగ విలువల ద్వారా మార్గనిర్దేశం చేయబడితే, వారు ఈ దిశలో విఫలం కారు. యువ న్యాయవాదులు నిర్భయంగా మార్పు కోసం ఉద్యమించి న్యాయ లక్ష్యాన్ని సాధించాలి

Indian Constitution: మౌనంగా ఉండడం వల్ల సమస్యల్ని పరిష్కరించలేమని, సమస్య ఏదైనా పరిష్కారం కావాలంటే చర్చించడం, మాట్లాడటం తప్పిన సరి అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. అయితే మాట్లాడడానికి కూడా హక్కు కావాలని, ధైర్యం కావాలని, స్వేచ్ఛ కావాలని.. ఈ మూడింటినీ భారత రాజ్యాంగం మనకు కాల్పించిందని ఆయన అన్నారు. రాజ్యాంగం అనేది స్వయం పాలన, గౌరవం, స్వాతంత్ర్యం యొక్క ప్రతీక అని.. అది పూర్తి స్వదేశీ పత్రమని అన్నారు. శనివారం మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ సదస్సులో పాల్గొన్న జస్టిస్‌ చంద్రచూడ్‌, అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

Turkey-Syria Earthquake: సహాయక చర్యల్లో అద్భుతం.. ఆ ఐదుగురిని కాపాడేశారు

‘‘ప్రతి ఒక్కరూ ఈ ఉదాత్తమైన వృత్తిని (చట్టాన్ని అనుసరిస్తూ) కొనసాగిస్తూ భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రాజ్యాంగం కల్పించిందన్న విషయాన్ని మరువొద్దు. మనం హక్కుల కోసం మాట్లాడాలి. యువ న్యాయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు రాజ్యాంగ విలువల ద్వారా మార్గనిర్దేశం చేయబడితే, వారు ఈ దిశలో విఫలం కారు. యువ న్యాయవాదులు నిర్భయంగా మార్పు కోసం ఉద్యమించి న్యాయ లక్ష్యాన్ని సాధించాలి. చట్టం స్వభావం బద్ధకంగా ఉన్నందున ఇప్పుడున్న స్థితిని కొనసాగించడానికి పాలకులకు లక్ష సాకులు సులభంగానే దొరుకుతాయి. కానీ, మీరు దాన్ని వీలైనంతగా బద్దలు కొట్టే ప్రయత్నం చేయాలి’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

Amit Shah on Karnataka: కర్ణాటక అంటే ఏంటో అమిషాకు ఆ సినిమా చూశాకే తెలిసిందట

భారత రాజ్యాంగం అత్యంత గొప్పదని, గౌరవమైనది జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. రాజ్యాంగంలోని విలువలను వృత్తి జీవితానికి అన్వయించుకుంటే అపజయం అనేది దరికి చేరదని ఆయన పేర్కొన్నారు. స్వయంపాలన, ఆత్మగౌరవం, స్వతంత్రతలతో కూడిన పూర్తి స్వదేశీ సృష్టి మన రాజ్యాంగం అని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం వలస పాలకులు ఇస్తే మనం పుచ్చుకున్నది కాదని, అది మన సొంతమని, సొత్తని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు