Indian Government: మెటాపై కేంద్రం ఆగ్రహం.. అసభ్య ప్రకటనలపై నోటీసులు.. వివరణ ఇవ్వకపోతే..

ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలల లైంగిక దోపిడీ, వేధింపులను ప్రోత్సహించే కంటెంట్ కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం(Indian Government) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Indian government issues notice to Meta over child exploitation content

  • మెటాకు కేంద్రం నోటీసులు.
  • అభ్యంతరకర ప్రకటనలపై ఆగ్రహం.
  • చట్టపరమైన చర్యల హెచ్చరిక.

Indian Government: ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలల లైంగిక దోపిడీ, వేధింపులను ప్రోత్సహించే కంటెంట్ కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (Meta) కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) అత్యవసర నోటీసులు జారీ చేసింది. అభ్యంతరకరమైన ఆ ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.

Chicken Prices Hike: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కారణం ఏంటంటే?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లోని కొన్ని చెల్లింపు ప్రకటనల్లో బాలల భద్రతకు విఘాతం కలిగించే అనుచిత కంటెంట్ ఉన్నట్లు ప్రభుత్వం (Indian Government)గుర్తించింది. దీనిపై స్పందించిన కేంద్రం, ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెటాను ఆదేశించింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే కఠిన చర్యల వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది.

ఒకవేళ నిర్ణీత గడువులోగా మెటా స్పందించకపోతే, ఐటీ (IT) చట్టంతో పాటు పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇటీవల టెలిగ్రామ్‌కు కూడా నోటీసులు ఇచ్చిన కేంద్రం, తాజా చర్య ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోని చట్టవిరుద్ధ, హానికరమైన కంటెంట్‌పై తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.