Indian Railways Rule : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ కొత్త రూల్ మీకు తెలుసా..? ఇలాచేస్తే డబ్బులొస్తాయ్..

Indian Railways New Rule : రైలులో ఏసీ టికెట్ బుక్ చేసుకున్నారా? అయితే మీకు తెలియని ఓ ముఖ్యమైన రైల్వే రూల్ ఉంది. ఇలా చేస్తే మీరు డబ్బులు వెనక్కు పొందొచ్చు.ప

Indian Railways New Rules

Indian Railways New Rule : రైలులో ఏసీ టికెట్ బుక్ చేసుకున్నారా? అయితే మీకు తెలియని ఓ ముఖ్యమైన రైల్వే రూల్ ఉంది. ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు బెడ్‌ రోల్ లేదా దుప్పటి అందలేదా? అయితే, మీరు డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. చాలామంది ప్రయాణికులకు తెలియని ఈ నిబంధన ఇప్పుడు వైరల్‌గా మారింది. రైల్వే అందించాల్సిన సదుపాయం రాకపోతే ఏం చేయాలి? ఎంత మొత్తం రీఫండ్ వస్తుంది? ఈ రూల్ గురించి ప్రతి ఏసీ రైలులో ప్రయాణించే ప్రయాణికుడు తప్పక తెలుసుకోవాల్సిందే!

Also Read : ఒకే టికెట్‌తో ఒకే రోజు రెండు సార్లు తిరుమల శ్రీవారి దర్శనం.. ఇలా చేయండి..

రైలులో ఏసీ కోచ్‌లో ప్రయాణించే వారికి ముఖ్యమైన విషయం ఇది. ఏసీ తరగతి టికెట్‌లో భాగంగా అందించాల్సిన బెడ్‌రోల్ సౌకర్యాలు అందకపోతే ప్రయాణికులు రీఫండ్‌ పొందే అవకాశం ఉంది. ఈ నిబంధన చాలామంది ప్రయాణికులకు తెలియకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి బెడ్‌షీట్, దిండు, టవల్, దుప్పటి వంటి బెడ్‌రోల్ సౌకర్యాలు టికెట్‌లోనే భాగంగా ఉంటాయి. ఈ సదుపాయం సాధారణంగా 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ తరగతులకు వర్తిస్తుంది. ఇందుకోసం ప్రయాణికులు ప్రత్యేకంగా అదనపు చార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

మీరు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో బెడ్‌రోల్ అందకపోతే ముందుగా కోచ్ అటెండెంట్‌ను సంప్రదించాలి. సమస్య పరిష్కారం కాకపోతే ఫిర్యాదు చేయవచ్చు. అయితే రీఫండ్‌ పొందేందుకు నిర్దిష్ట ప్రక్రియ, గడువు పాటించాల్సి ఉంటుంది. ఏసీ కోచ్‌లో ప్రయాణించినప్పటికీ మీకు బెడ్‌రోల్ సౌకర్యం అందకపోతే రూ.20 రీఫండ్‌ పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రయాణికుడు గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకునేలోపు/చేరుకున్న తర్వాత నిర్దేశిత ఫిర్యాదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్లీపర్ తరగతిలో బెడ్‌రోల్ సౌకర్యాలకు ఇదే నిబంధన వర్తించదు. కొన్ని రైళ్లలో ప్రయాణికులు బెడ్‌రోల్ కోసం ప్రత్యేకంగా చెల్లింపు చేయాల్సి రావొచ్చు. అందువల్ల ఏసీ, స్లీపర్ కోచ్‌ల బెడ్‌రోల్ సదుపాయాల మధ్య నిబంధనల్లో తేడాలు ఉంటాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాల్సి ఉంటుంది.