IndiGo Offers : భారతదేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. వైరస్ కు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. సాధ్యమైనంత తొందరలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే..చాలా మంది వ్యాక్సిన్ ఇప్పించుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో కొన్ని సామాజిక సంస్థలు, ఇతర కంపెనీలు పలు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.
వ్యాక్సిన్ వేసుకుంటే..బీరు, బిర్యానీ…ఫ్రీ..ఇతర విలువైన వస్తువులు ఇస్తామని వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా..విమానయాన రంగంలో ఉన్న ఇండిగో కూడా ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి విమాన టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు వ్యాక్సిన్ ఫేర్ పేరిట కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. 2021, జూన్ 23వ తేదీ బుధవారం అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
18 ఏళ్లకు పైబడి ఉన్న వారు వ్యాక్సిన్ వేసుకుంటే..టికెట్ బుక్ చేసుకున్న సమయానికి భారత్ లో రెండు డోస్ లు లేదా కనీసం ఒక్క డోస్ తీసుకున్న వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపింది. బేస్ ధరపై పది శాతం రాయితీ ఇస్తామేని, ఆఫర్ ను వినియోగించుకోవాలని అనుకున్న వారు..కేంద్ర ఆరోగ్య శాఖ..జారీ చేసిన టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకరావాల్సి ఉంటుందని, దీనిని ఎయిర్ పోర్టు చెక్ చేసే కౌంటర్, బోర్డింగ్ వద్ద చూపించాలని తెలిపింది.
ఆరోగ్య సేతు యాప్ లో వ్యాక్సినేషన్ స్టేటస్ ను కూడా చూపించొచ్చని, అన్ని రకాల ప్రయాణాలు, టికెట్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. జాతీయ టీకా పంపిణీ విధానానికి తమ వంతు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ వెల్లడించారు.
Got vaccinated? Grab this exclusive offer! Know more https://t.co/w6MLsY5oCZ #LetsIndiGo #Aviation #GetVaccinated #Vaccinated pic.twitter.com/P0LbiHKK4t
— IndiGo (@IndiGo6E) June 23, 2021