Indore Snake Bite Murder Case: పాముకాటు కాదు.. పక్కా ప్లాన్.. భార్యను చంపేసి పాముతో డ్రామాలు.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ఇండోర్‌(Indore Snake Bite Murder Case)కు చెందిన అమితేష్ అలియాస్ షాలు పటేలియా తన భార్య శివానిని వదిలించుకోవాలని పథకం వేశాడు.

indore snake bite murder case man gets life sentence for killing his wife

  • భార్యను గొంతునులిమి చంపాడు
  • నాగుపాముతో డ్రామా ఆడాడు
  • కోర్టు జీవితఖైదు విధించింది

Indore Snake Bite Murder Case: మనుషుల మధ్య పెరిగే క్రూరత్వం ఒక్కోసారి ఊహకందని నేరాలకు దారితీస్తుంది. సాధారణంగా హత్య అనగానే ఆయుధాలు, విషప్రయోగం వంటివి గుర్తుకొస్తాయి. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఒక ఘోర హత్యోదంతం మాత్రం దర్యాప్తు అధికారులనే విస్మయానికి గురిచేసింది. భార్య మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ఓ భర్త వేసిన స్కెచ్, చివరకు అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Jr NTR Political Entry: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే భారీ మీటింగ్‌.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన న్యూస్!

కేసు వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌(Indore Snake Bite Murder Case)కు చెందిన అమితేష్ అలియాస్ షాలు పటేలియా తన భార్య శివానిని వదిలించుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం రాజస్థాన్‌లోని అల్వార్‌కు వెళ్లి రూ.5 వేలకు ఒక నాగుపామును కొనుగోలు చేశాడు. దానిని ఇంట్లో 11 రోజుల పాటు రహస్యంగా దాచాడు. ఒకరోజు రాత్రి భార్య గొంతు నులిమి హత్య చేసిన అనంతరం, అది పాముకాటు వల్ల జరిగిన మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. చనిపోయిన భార్య చేతిపై ఆ పాముతో కరిపించాలని చూశాడు. కానీ అది కాటు వేయకపోవడంతో, ఆ పామును కూడా చంపేసి, దాని విషాన్ని భార్య చేతిపై పూసి నాటకమాడాడు.

అయితే, పోలీసుల చాకచక్యం, ఫోరెన్సిక్ రిపోర్టులు అమితేష్ పాపాన్ని పట్టిచ్చాయి. ఈ కేసుతో అల్వార్‌లో విషసర్పాల అక్రమ విక్రయాల దందా కూడా వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్ సమీపంలో అంత సులభంగా నాగుపాము దొరకడం వెనుక పెద్ద స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పామును అమ్మిన వ్యక్తి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. 2019 నాటి ఈ ఘోర కలియుగ వింత నేరం, తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ముగిసింది.