భావోద్వేగంతో INS Viraat కు వీడ్కోలు..తుక్కు కింద అమ్మేయనున్నారు

  • Updated on- September 20, 2020 / 09:21 AM IST

INS Viraat Grand Old Lady : ‘ది గ్రాండ్‌ ఓల్డ్‌ లేడీ’గా ఖ్యాతిగాంచిన విమానవాహక నౌక ‘INS Viraat‌’ త్వరలో కనుమరుగుకానున్నది. గుజరాత్‌లోని అలంగ్‌లో విడభాగాలుగా చేసి తుక్కు కింద అమ్మేయనున్నారు. మూడేండ్ల క్రితమే సేవల నుంచి ఈ నౌక వైదొలగింది. శనివారం ముంబాయి నావల్ డాక్ యార్డు నుంచి గుజరాత్ రాష్ట్రానికి బయలుదేరింది.



ఈ సందర్భంగా..నౌకాదళ అధికారులు వీడ్కోలు పలికారు. తీవ్ర భావోద్వేగంతో, ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుని..దానికి ఘనంగా వీడ్కోలు చెప్పారు. తుక్కుకింద అమ్మేయకుండా..ఒక మ్యూజియంగ మార్చాలని అనుకున్నా..అవి సక్సెస్ కాలేదు. ఈ నౌకను అలంగ్ కు చెందిన శ్రీరామ్ గ్రూపు రూ. 38.54 కోట్లకు వేలంలో దక్కించుకుంది.



ఇక దీని చరిత్ర
⇒ ఐఎన్‌ఎస్‌ విరాట్‌ 1500 మంది సిబ్బందిని, 25 యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు.
⇒ రెండో ప్రపంచయుద్ధ సమయంలో నిర్మితమైంది. ఇన్ని రోజులు ఏకైక యుద్ధనౌక బహుశా విరాట్‌ మాత్రమేనంటున్నారు.
⇒ ఇండియన్‌ నేవీలో చేరే సమయంలో ఇది ఏడేండ్లకు మించి పని చేయదని బ్రిటన్‌ అధికారులు భావించారు. అయితే 30 ఏండ్లపాటు సేవలందించింది.



⇒ INS Viraat 1987లో భారత నావికాదళంలో చేరింది.
⇒ ఇండియన్‌ నేవీలో చేరిన తర్వాత ఐఎన్‌ఎస్‌ విరాట్‌గా పేరు మార్చారు. అర్ధశతాబ్దానికిపైగా ఈ నౌక సేవలందించింది.
⇒ ఆపరేషన్‌ జూపిటర్‌, ఆపరేషన్‌ పరాక్రమ్‌, ఆపరేషన్‌ విజయ్‌ వంటి పలు కీలక మిలటరీ ఆపరేషన్లలో విరాట్‌ పాల్గొంది.
⇒ మలబార్‌, అరుణ, నజీమ్‌ అల్‌ బహర్‌, ట్రోపెక్స్‌ వంటి యుద్ధ విన్యాసాల్లోనూ పాల్గొంది.
⇒ చివరిసారిగా 2016లో విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంది.