Kota hostel ceiling fan : హాస్టల్ గదుల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు ఫ్యాన్లకు ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Kota hostel ceiling fan : తరచూ విద్యార్థులు సీలింగ్ ఫ్యాన్లకు ఉరివేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్ లోని గదులన్నింటికి ఐరన్ గ్రిల్‌తో ప్యాన్ చెట్టూరా జల్లెడ ఏర్పాటు చేశారు.

Kota hostel ceiling fan

Kota hostel ceiling fan : రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలోని ఓ హాస్టల్‌ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు అన్నింటికి ఐరన్ గిల్‌తో భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇలా ఏర్పాటు చేయడం వెనుక విద్యార్థుల ప్రాణాలను కాపాడేందుకుదని హాస్టల్ యాజమాన్యం పేర్కొంది.

Also Read : LPG Tanker : గుడ్‌న్యూస్.. గ్యాస్ కష్టాలు తీరబోతున్నాయ్.. హర్మూజ్‌ను దాటేసిన భారత నౌక.. ఎన్ని మెట్రిక్ టన్నుల ఎల్సీజీ వస్తుందో తెలుసా?

తరచూ విద్యార్థులు సీలింగ్ ఫ్యాన్లకు ఉరివేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్ లోని గదులన్నింటికి ఐరన్ గ్రిల్‌తో ప్యాన్ చెట్టూరా జల్లెడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొందరు నెటిజన్లు వీటిపై విమర్శలు చేస్తున్నారు.

హాస్టల్ యాజమాన్యం నిర్ణయంపై పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే చేపట్టాల్సిన చర్యలు ఇవి కాదని పేర్కొంటున్నారు. ఇవి కేవలం తాత్కాలిక పరిష్కారాలే అంటూ విమర్శిస్తున్నారు. విద్యార్థులపై ఉన్న తీవ్రమైన చదువు ఒత్తిడి, తగిన మానసిక ఆరోగ్య సహాయం లేకపోవడం, ఒంటరితనం వంటి పలు కారణాలవల్ల విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, కానీ, వారి ఆత్మహత్యలు తగ్గించడానికి ఇలాంటి పరిష్కారాలతో ఉపయోగం లేదని, విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేలా, శాశ్వత పరిష్కాలను కనుగొనాలని సూచిస్తున్నారు.

ఓ నెటిజన్ స్పందిస్తూ.. నిజంగా ఇది అసహ్యంగా ఉంది. పిల్లలకు ఇష్టంలేని దానిలోకి బలవంతంగా నెట్టి ఈ కోచింగ్ ఇనిస్టిట్యూట్ లు, తల్లిదండ్రులు సృష్టించిన వ్యవస్థ గురించి ఇది చాలా చెబుతోంది అని పేర్కొన్నాడు