Delta Variant: పిల్లలకు డేంజర్‌గా డెల్టా వేరియంట్..? WHO అలర్ట్!

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. మరోసారి భయం పుట్టిస్తోంది. ప్రపంచంపై డెల్టా వేరియంట్ వేరీ డేంజర్‌గా తయారైంది.

Delta Variant: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. మరోసారి భయం పుట్టిస్తోంది. ప్రపంచంపై డెల్టా వేరియంట్ వేరీ డేంజర్‌గా తయారైంది. మొత్తం 185 దేశాల్లో ఈ వేరియంట్ కనిపించినట్లుగా ప్రపంచ ఆరోగ్యసంస్థ లేటెస్ట్‌గా వెల్లడించింది. జూన్‌ 15 నుంచి సెప్టెంబరు 15 మధ్య సేకరించిన నమూనాల్లో 90శాతం డెల్టా కేసులే ఉన్నాయని, మళ్లీ కరోనా విజృంభిస్తే మాత్రం కారణం డెల్టా వేరియంటే అవుతుందని చెప్పారు.

కరోనా వైరస్‌ ఆల్ఫా, బీటా, గామా, కప్పా వేరియంట్లు కొన్ని దేశాల్లో ఉన్నప్పటికీ, కరోనా డెల్టా వేరియంటే కోవిడ్ వ్యాప్తికి ఎక్కువగా కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆల్ఫా, బీటా, గామా రకం కేసులు ఒక శాతం కంటే తక్కువే ఉన్నాయని, డెల్టా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

వ్యాక్సిన్లు తీసుకోని వారితో పాటు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఈ వేరియంట్ వ్యాపిస్తుంది. డెల్టా వేరియంట్ ప్రమాదకరంగా మారడానికి మరో కారణం డెల్టా వేరియంట్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రూపాంతరం చెందడమే అని నిపుణులు చెబుతున్నారు.

ఫస్ట్ వేవ్ సమయంలో.. ఒక వ్యక్తికి కొవిడ్‌ వస్తే, ఇంట్లో ఉండే 20శాతం సభ్యులకే సోకిందని, సెకండ్ వేవ్ సమయంలో 80శాతం సభ్యులకు సోకిందని, డెల్టా రకం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లుగా వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. కరోనాకు పుట్టినిల్లయిన చైనాతో పాటు, అమెరికాలో కూడా డెల్టా వేరియంట్ తీవ్రంగా వ్యాపించింది.

డెల్టా వేరియంట్ ముఖ్యంగా పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని, డెల్టా వేరియంట్‌కు పిల్లలకు సులభంగా వ్యాప్తి చెందగల సామర్థ్యం ఉందని, పాఠశాలల్లో మాస్క్‌లు మరియు తగినంత వయస్సు ఉన్న వారికి వ్యాక్సినేషన్ వేయించడం అవసరం ఉందన్నారు. అయితే, డెల్టా వేరియంట్ మునుపటి వెర్షన్‌ల కంటే పిల్లలు మరియు టీనేజ్‌ వారిని అనారోగ్యానికి గురిచేస్తుందనడానికి బలమైన ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు