ఇలా చేశావ్ ఏంటి? ఆఫీసు మీటింగులో డ్యాన్స్ చేసిన ఉద్యోగిని

ఉద్యోగంలో చేరేటప్పుడు రెజ్యూమ్‌లో హాబీగా డ్యాన్స్ అని రాసిందని, అందుకే తాను..

Photos: Anjali Patwal/Instagram

ఆఫీసు మీటింగులో డ్యాన్స్ చేసి అదరగొట్టింది ఓ ఉద్యోగిని. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పూణేకు చెందిన అంజలి అనే మహిళ తన ఆఫీసులో తాజాగా మంత్లీ టీమ్ మీటింగ్‌కు హాజరైంది.

మరికొంత మంది ఉద్యోగులు జూమ్ ద్వారా ఈ మీటింగులో పాల్గొన్నారు. అదే సమయంలో అంజలి ‘భాగ్ మిల్కా భాగ్’ పాట ‘ఓ రంగ్రేజ్’కి డ్యాన్స్ చేసింది. అంజలి కంటెంట్ క్రియేటర్ కూడా కావడంతో ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు దాదాపు ఎనిమిది మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.

ఆఫీసులోని కాన్ఫరెన్స్ రూమ్‌లో ఉద్యోగులు డ్యాన్స్ కూడా చేస్తారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంత బాగా ఎలా డ్యాన్స్ చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆమె ఉద్యోగంలో చేరేటప్పుడు రెజ్యూమ్‌లో హాబీగా డ్యాన్స్ అని రాసిందని, అందుకే తాను రాసింది నిజమేనని నిరూపించుకోవడానికి ఇలా ఇప్పుడు డ్యాన్స్ చేసి ఉండొచ్చని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. ఆఫీసుల్లో నిర్వహించే ప్రతి మీటింగులో ఉద్యోగులకు ఇలాంటి డ్యాన్స్ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందంటూ మరో నెటిజన్ చమత్కరించాడు.

 Also Read: బ్యాగులో గన్ పెట్టుకువెళ్లి.. స్కూల్లో కాల్పులు జరిపిన నర్సరీ చిన్నారి

ట్రెండింగ్ వార్తలు