YS Jagan: రేర్ సీన్స్.. ఆ నేతలు ఒకే వేదికపై ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదు. అలాంటిది పలువురు కీలక నేతలంతా ఒకే ఫంక్షన్‌లో కలుసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మాట్లాడుకున్నారు.
చెన్నై వేదికగా జరిగిన ఓ వివాహ వేడుకలో జగన్ కాంగ్రెస్ పెద్దలతో పాటు అక్కడి డీఎంకే నేతలు సీఎం స్టాలిన్ సహా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ఇలా ఎంతో మందిని కలిశారు. తమిళనాట రాజకీయాన్ని జగన్ చుట్టేశారనే చెప్పొచ్చు.
చెన్నైలో జగన్ అన్న కుమారుడి పెళ్లి జరిగింది. పైగా వధువు వైపు వారు కూడా వైసీపీలో కీలకమైన మేకపాటి ఫ్యామిలీకి చెందిన వారేనట. అలా ఆ పెండ్లిలో రాజకీయ కళ అయితే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఆ పెళ్లికి వచ్చిన వాళ్లంతా..పొలిటికల్ లీడర్లు, వాళ్లు మాట్లాడుకుంటున్న తీరును గమనించడానికే సరిపోయారట. పెండ్లికి హాజరైన అతిథులతో జగన్ ముచ్చట్లు, పలకరింపులు, మంతనాలు అన్నీ ఫుల్ హైలైట్ అయ్యాయి.
Also Read: పురపోరు అయిపోగానే.. పదవుల భర్తీ? మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులెవరికి?
వైసీపీ సోషల్ మీడియా అయితే ఫుల్ లోడెడ్ అనుకోవచ్చు. అయితే జగన్ ఎప్పుడూ ఏ ఫంక్షన్‌లోనూ ఇంతసేపు ఉండలేదు. ఒకేసారి ఇంతమంది ప్రముఖులను కూడా కలవలేదు. కానీ చెన్నై వేదికగా జరిగిన వివాహ వేడుకలో మాత్రం జగన్ కాంగ్రెస్ పెద్దలతో పాటు అక్కడి డీఎంకే నేతలు, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్‌తో పాటు ఎంతో మందిని కలవడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఎక్కువ మంది ఇండియా కూటమి నేతలే
వివాహ వేడుకకు హాజరైన నేతల్లో ఎక్కువ మంది ఇండియా కూటమి నేతలు ఉండటం ఇంకా స్పెషల్. డీఎంకే, కాంగ్రెస్ నేతలే ఎక్కువగా కనిపించారు. ఇక ఏపీ నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. అలాగే సినీ నటుడు మోహన్ బాబు కూడా ఈ వేడుకలలో జగన్‌తో మీట్ కావడం మరో ఆసక్తికరమైన సన్నివేశం.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కాంగ్రెస్ అగ్రనేతలతో ముచ్చట్లు పెట్టడం ఇంట్రెస్టింగ్ సీన్‌గా మారింది. పెండ్లికి హాజరైన కేంద్ర మాజీమంత్రి కాంగ్రెస్ నేత చిదంబరం, జగన్ కలిసి ముచ్చటించుకోవడం ఆసక్తిగా కనిపించింది. జగన్ కాంగ్రెస్ వీడాక ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరితోనూ ఓపెన్ డయాస్‌ల మీద కలిసింది లేదు.
అఫ్ కోర్స్ ఇది పెళ్లి వేడుక..పైగా తమ ఇంట్లో కార్యక్రమం. దాంతో కాంగ్రెస్ నేతలతో జగన్ మంతనాలు..కర్టెసీగానే చెప్పుకుంటున్నా..ప్రస్తుతమున్న పొలిటికల్ సినారియోలో వివాహ వేడుకలో సమావేశాలను లైట్ తీసుకోలేమంటున్నారు. చిదంబరంతో జగన్ ముచ్చట్లలో పొలిటికల్ అంశాలు ప్రస్తావనకు వచ్చాయా..లేక క్యాజువల్‌గా మాట్లాడుకుని ఉంటారా అనేది ఉత్కంఠగా మారింది.
మాజీ రాజ్యసభ సభ్యుడు, దివంగత వైఎస్‌కు ఆత్మీయుడు కేవీపీ రామచందర్‌రావును కూడా జగన్ కలుసుకోవడం మరో కీలక పరిణామం. జగన్ కాంగ్రెస్‌ను వీడాక కేవీపీని పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. కానీ చెన్నైలో జరిగిన పెండ్లి వేడుకలో మాత్రం అంకుల్ హౌ ఆర్ యూ అంటూ జగన్ ఆయన్ని హగ్ చేసుకోవడం కేవీపీ కూడా జగన్‌తో ఆప్యాయంగా మాట్లాడటం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ మీట్‌గా చర్చ నడుస్తోంది.
రాజకీయాల్లో ప్రతి కదలికకూ ఒక అర్థం
పొలిటికల్ లీడర్లు ఎక్కడికి వెళ్లినా..ఏం చేసినా ఎంతో కొంత రాజకీయంతో ముడిపడి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. రాజకీయాల్లో ప్రతి కదలికకూ ఒక అర్థం ఉంటుంది. ఒక ఇండికేషన్ కూడా ఉంటుంది. ఏ భేటీ ఊరికే జరగదు..పొలిటికల్ లీడర్లు కలుసుకున్నాకా రాజకీయాలు మాట్లాడుకోకుండా అసలే ఉండలేరు. పెండ్లి వేడుకలో మర్యాదపూర్వకంగా మాట్లాడుకుని ముచ్చట్లు పెట్టుకున్నా..ఎక్కడో ఒక చోట సింక్..లింక్ అయ్యే సందర్భాలు రావొచ్చని..పాలిటిక్స్ ఏదైనా సాధ్యమన్న చర్చ జరుగుతోంది.
ఇండియా కూటమికి అతి పెద్ద దిక్కుగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు. ఆయనకు జగన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయంటుంటారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిప్పుడు ఆయన ప్రమాణస్వీకారానికి వచ్చిన ప్రముఖుల్లో స్టాలిన్ ఒకరు. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా జగన్‌తో ఆప్యాయంగా మాట్లాడారు.
రేపటి రాజకీయాల్లో తన ప్రభావం చూపించబోయే విజయ్ కూడా జగన్‌తో మంతనాలు జరిపారు. ఇవన్నీ చూస్తుంటే జాతీయ స్థాయిలో ఎక్కడో ఒకచోట పొలిటికల్ ఈక్వేషన్స్ మారేందుకు బాటలు పడ్డట్లేనా అన్న చర్చ అయితే సాగుతోంది. జగన్ రోజంతా ఒక కార్యక్రమంలో ఉండటం..అందరితోనూ కలసి నవ్వుతూ మాట్లాడటం చూస్తే సమ్‌థింగ్ ఈజ్ దేర్ అన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.