Jain festival: రెండ్రోజులు మాంసం తినకు.. మాంసం నియంత్రణపై పిటిషన్ వేసిన వ్యక్తికి కోర్టు సూచన
ఈ విషయమై హైకోర్టు స్పందిస్తూ విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ రోడ్లపై ఉన్న మాంసాహార దుకాణాల్ని ఏఎంసీ బలవంతంగా తొలగించింది. గతేడాది డిసెంబరులో దీనిపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ విషయమై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, అవన్నీ తప్పుడు ఆరోపణలని సమాధానం ఇచ్చింది.
- tony bekkal
- Published on- August 31, 2022 / 05:26 PM IST
in gujarat slaughterhouse to pull down its shutters for some days due to festivals
Jain festival: జైన్ పండుగ సందర్భంగా విధించిన మాంసం నియంత్రణను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన వ్యక్తికి కోర్టు నుంచి ఆశ్చర్యకరమైన సూచన వచ్చింది. అతడినే రెండు రోజుల పాటు మాంసం తినడం మానేయమంటూ కోర్టు సలహా ఇచ్చినట్టు సమాచారం. గుజరాత్లోని అహ్మదాబాద్లో జైన్ పండుగ సందర్భంగా ఆగస్టు 24 నుంచి 31, సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీల మధ్య మాంసం విక్రయాలు చేపట్టవద్దంటూ కబేళాలకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ విషయమై కుల్ హింద్ జమైత్ ఆల్ ఖురేషి ఆక్షన్ కమిటీ గుజరాత్ సంఘానికి చెందిన దానిష్ ఖురేషి రజావాలా అనే వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాంసం నియంత్రణ చేపట్టిందని, దాన్ని రద్దు చేయాలంటూ పిటిషన్ ద్వారా కోర్టును వేడుకున్నాడు. కాగా, ఈ పిటిషన్పై విచారించిన ధర్మాసనం.. ‘‘నీకు నువ్వుగా రెండ్రోల పాటు మాంసం నియంత్రణ చేపట్టు’’ అంటూ సూచన చేసింది.
‘‘అహ్మదాబాద్ నగరంలో ఇప్పుడు ఒకే ఒక కబేళా ఉంది. జైనుల పండగ సందర్భంగా ఇప్పుడు అది కూడా మూసివేశారు. ఆగస్టు 23న ఏఎంసీ ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది’’ అని కోర్టు ముందు పిటిషన్ పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై హైకోర్టు స్పందిస్తూ విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ రోడ్లపై ఉన్న మాంసాహార దుకాణాల్ని ఏఎంసీ బలవంతంగా తొలగించింది. గతేడాది డిసెంబరులో దీనిపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ విషయమై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, అవన్నీ తప్పుడు ఆరోపణలని సమాధానం ఇచ్చింది.
Punjab: పంజాబ్‌లో పాస్టర్ కారు దహనం చేసిన దుండగులు.. ఆ నేత వ్యాఖ్యలే కారణమా?
