ఆ జాతరలో అదే ఆచారం..ముద్దులు పెడుతూ డ్యాన్స్ జాతర అంటే చాలు…డప్పులు..మొక్కులు హంగామా. కానీ కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాకు ఆనుకుని ఉన్న దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి గ్రామంలో 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఆ జాతరలో భార్యాభర్తలు కలిసి పాల్గొంటారు. ఇదో పెద్ద విశేషమా అనుకోవచ్చు..కానీ భార్యాభర్తలు జాతరలో పబ్లిక్ లో డాన్స్‌లు వేయాలి. అంతేకాదు అలా డాన్స్ లు వేస్తు ముద్దులు పెట్టుకోవాలి.
ఆ జాతరలో దంపతులు ముద్దులు పెట్టుకోవటం ఆచారంగా వస్తోంది. దీనికి వయస్సుతో తారతమ్యం ఉండదు. యువకులు..మధ్యవయస్సువారితో పాటు వృద్ధులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. డాన్సులు వేస్తూ ముద్దులు పెట్టుకుంటారు. ఈ క్రమంలో శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గ్రామస్థులు ఆచార, సాంప్రదాయాలతో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భార్యాభర్తలు డాన్సులు వేస్తూ ముద్దులు పెట్టుకున్నారు.
10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతరలో పురుషలు భార్యలను పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవటానికి ఎంతో హుషారుగా పాల్గొంటారు. భార్యలు మాత్ర భర్తలతో కలిసి డ్యాన్సులు చాలా ఉత్సాహంగా వేస్తారు. కానీ మధ్యలో భర్తలు ముద్దులు పెట్టుకునేటప్పుడు మాత్రం సిగ్గుపడిపోతారు.
దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి గ్రామంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి గ్రామదేవత ఊరమ్మ దేవి జాతరలో భార్యాభర్తలు డాన్సులు వేస్తూ ముద్దులు పెట్టుకుంటారు. భక్తులు జంటలుగా డ్యాన్స్ చేయడం, ముద్దులు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం.
ఈ వింత సాంప్రదాయాన్ని పాటిస్తేనే అమ్మవారు సంతృప్తి చెందుతారని, తామంతా అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులవుతామని స్థానికుల విపరీతంగా నమ్ముతారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ..జాతరలో ప్రారంభంలో అమ్మవారికి విశేష అలంకరణలు చేస్తామనీ..తరువత విశేష పూజలు చేస్తామని, అనంతరం అనాదిగా వస్తున్న ఈ నృత్యాన్ని చేస్తామని తెలిపారు.
See Also | ఫిబ్రవరి 29: అమ్మాయిలు అబ్బాయిలకు ప్రపోజ్ చేసే రోజు