Congress MLA: కంగనా రనౌత్ బుగ్గల్లాంటి నున్నని రోడ్లు వేస్తా: ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
రానున్న రోజుల్లో తన నియోజకవర్గంలో రోడ్లన్నీ కంగనా రనౌత్ బుగ్గల్లాగా నున్నగా చేస్తానని ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ తన నియోజకవర్గ ప్రజలకు మాటిస్తున్నట్లు ప్రకటించారు
- Bharath Reddy
- Published on- January 16, 2022 / 08:27 AM IST
Kangana
Congress MLA: రానున్న రోజుల్లో తన నియోజకవర్గంలో రోడ్లన్నీ కంగనా రనౌత్ బుగ్గల్లాగా నున్నగా చేస్తానని ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ తన నియోజకవర్గ ప్రజలకు మాటిస్తున్నట్లు ప్రకటించారు. ఝార్ఖండ్ లోని జంతారా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ..శనివారం నాడు విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియోలో ఈవ్యాఖ్యలు చేశారు. “సినిమా నటి కంగనా రనౌత్ చెంపల కంటే జమతారా రోడ్లు సున్నితంగా ఉంటాయని నేను మీకు హామీ ఇస్తున్నాను, 14 ప్రపంచ స్థాయి రోడ్లను త్వరలో నియోజకవర్గంలో ప్రారంభించనున్నాం” అంటూ అన్సారీ ఆ వీడియోలో పేర్కొన్నారు.
Also read: Secunderabad Club : సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం… కోట్లలో ఆస్తి నష్టం
కాగా ఎమ్మెల్యే అన్సారీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. అన్సారీ చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా.. నెటిజన్లు ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆత్మాభిమానం కలిగిన నటి గురించి.. ఒక ప్రజాప్రతినిధిగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. రాజకీయ నేతలు, సినీ హీరోయిన్ల బుగ్గలపై సంచలన వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు.
Also read: UP Elections: యూపీ ఎన్నికల్లో మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి బికినీ ఫోటోలు వైరల్
గతేడాది నవంబర్ లో రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూఢా.. తమ రాష్ట్రంలో రోడ్లను సినీ నటి కత్రీనా కైఫ్ బుగ్గల్లాగా మెత్తగా ఉండేలా చేస్తానని పేర్కొన్నారు. డిసెంబర్ లో మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత గులాబ్ రావ్ పాటిల్ సైతం.. తన సొంత నియోజకవర్గం జలగావ్ రోడ్లను సినీ నటి హేమామాలిని బుగ్గలతో పోల్చారు. దీనిపై మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో గులాబ్ రావ్ క్షమాపణలు చెప్పారు. ఇక సినీతారల బుగ్గలపై వ్యాఖ్యలు చేసిన మొదటి రాజకీయ నేతగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చరిత్రకెక్కారు. 2005లో బీహార్ సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్.. బీహార్ రోడ్లను హేమా మాలినీ బుగ్గలతో పోల్చారు.
Also read: Brave Woman: డ్రైవింగ్ లో మూర్చపోయిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన మహిళ
