Jio Data Plans : వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి జియో గుడ్ న్యూస్.. బెస్ట్ డేటా ప్లాన్స్ విడుదల…
కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇచ్చాయి. అనేకమంది ఉద్యోగులు చాలారోజులుగా ఇంటి నుంచే పని చేస్తున్నారు. మరి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే..
- Naveen
- Published On : July 15, 2021 / 06:16 PM IST
Jio Data Plans
Jio Data Plans : కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇచ్చాయి. అనేకమంది ఉద్యోగులు చాలారోజులుగా ఇంటి నుంచే పని చేస్తున్నారు. మరి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే.. అన్నింటికన్నా ముఖ్యమైంది డేటా. నెట్ ఉంటేనే ఏ పని అయినా అవుతుంది. దీంతో టెలికం కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు పోటీలు పడుతున్నాయి. బెస్ట్ డేటా ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు డేటా ప్లాన్లు విడుదలు చేస్తున్నాయి. తాజాగా దిగ్గజ టెలికం కంపెనీ జియో.. తన కస్టమర్ల కోసం కొత్త డేటా ప్లాన్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిని ఉద్దేశించి ఈ ప్లాన్లు తీసుకొచ్చింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా డేటా అవసరం అవుతోంది. అయితే తక్కువ డబ్బుకే ఎక్కువ డేటా, వాలిడిటీ ఇచ్చే టెలికం కంపెనీల వైపు కస్టమర్లు చూస్తున్నారు. టెలికమ్ సర్వీస్ ఆపరేటర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా.. స్పెషల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్లు లాంచ్ చేశాయి. తక్కువ మొత్తానికే అధిక డేటా లాంటి అదనపు ప్రయోజనాలు అందిస్తున్నాయి. రిలయన్స్ జియో సైతం అలాంటి డేటా ప్లాన్లు తీసుకొచ్చింది.
Reliance Jio Rs 151 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్..
* ఈ ప్లాన్ కింద 30 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది
* కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు
* జియో యాప్స్ ని యాక్సెస్ చెయ్యలేరు
* ఇతర హోమ్ ప్లాన్స్ లాగానే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది
* వాలిడిటీ 30 రోజులు
Reliance Jio Rs 201 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్..
* అదనపు డేటా లభిస్తుంది
* ఈ ప్లాన్ కింద 40జీబీ డేటా ఇస్తారు
* ఇతర జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ల మాదిరి ఇది కూడా
* కాలింగ్, ఎస్ఎంఎస్, ఇతర ప్రయోజనాలు ఉండవు
* వాలిడిటీ 30 రోజులు
Reliance Jio Rs 251 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్..
* జియో నుంచి వచ్చిన లాస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ఇది
* మొత్తంగా 50జీబీ డేటా లభిస్తుంది
* కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, ఇతర యాప్ లను యాక్సెస్ చేయడం వంటి ప్రయోజనాలు ఉండవు
* ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు
