JK Dutt : మాజీ NSG చీఫ్ జేకే దత్ కన్నుమూత
ముంబై ఉగ్రదాడుల సమయంలో ఎన్ఎస్జీ కమాండోలకు నేతృత్వం వహించిన మాజీ డైరెక్టర్ జనరల్ జేకే దత్(72) కన్నుమూశారు.
- venkaiahnaidu
- Published On : May 19, 2021 / 09:11 PM IST
Jk Dutt
JK Dutt 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో ఎన్ఎస్జీ కమాండోలకు నేతృత్వం వహించిన మాజీ డైరెక్టర్ జనరల్ జేకే దత్(72) కన్నుమూశారు. కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మరణించారు.
కరోనా సోకిన జేకే దత్ ను ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుండడం వల్ల ఏప్రిల్ 14న గుర్గావ్లోని మేదాంతా ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత కోలుకున్నారని..అయితే కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నాం 3:30గంటల సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని తెలిపారు. జేకే దత్ కు భార్యా,కుమారుడు,కూతురు ఉన్నారు. కుమారుడు నోయిడాలో ఉద్యోగం చేస్తుండగా,కూతరు యూఎస్ లో ఉంటోంది.
