JK Terrorist killed : జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీరులో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కశ్మీరులోని రీసీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు...
- saleem sk
- Published On : September 5, 2023 / 10:50 AM IST
Encounter
Encounter : జమ్మూకశ్మీరులో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కశ్మీరులోని రీసీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. రీసీ ప్రాంతంలోని గాలి సోహబ్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులున్నారని అందిన సమాచారం మేర పోలీసులు, భద్రతా బలగాలు కలిసి మంగళవారం గాలింపు చేపట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. (JK Terrorist killed in Encounter) కాల్పుల్లో ఓ పోలీసు గాయపడటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.
Jill Biden Covid positive : జిల్ బిడెన్ కు కొవిడ్ పాజిటివ్…ప్రెసిడెంట్ బిడెన్‌కు నెగిటివ్
రీసీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్ ఏడీజీపీ ముకేష్ సింగ్ చెప్పారు. (Encounter with security forces in Reasi) పుల్వామా జిల్లా లారో పారిగం ప్రాంతంలో ఆగస్టు 21వతేదీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారం పెరగడంతో వారి కోసం పోలీసుల గాలింపును విస్తృతం చేశారు. దీంతో ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
