మాస్క్ లేని వాడు గాడిద : Donkeyని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు
- madhu
- Published On : July 23, 2020 / 07:49 AM IST
బీహార్ లో Mask లేని Donkeyతో ఓ జర్నలిస్టు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మాస్క్ లేకుండా..ఎందుకు రోడ్డు మీదకు వచ్చావ్ ? కరోనా వైరస్ ఉందనే విషయం తెలియదా ? అన్నట్లుగా దానిని ప్రశ్నించాడు. మాస్క్ లేకుండా..ప్రజలు రోడ్ల మీదకు రావొద్దనే విషయాన్ని ఆ జర్నలిస్టు గుర్తు చేస్తున్నాడని..మంచి ప్రయత్నమంటున్నారు నెటిజన్లు.
That’s an innovative way to spread awareness. Kudos to this guy pic.twitter.com/HenpeOaHA0
— Roop Darak BHARTIYA (@iRupND) July 21, 2020
ఓ రోడ్డుపై రెండు గాడిదలు వెళుతున్నప్పుడు ఓ జర్నలిస్టు చూశాడు. అమాంతం వాటి దగ్గరకు వెళ్లి..పబ్లిక్ ప్లేస్ లో మాస్క్ లు లేకుండా బయటకు ఎలా వస్తారు ? సమాధానం చెప్పాలంటూ వాటి మూతి దగ్గర మైక్ పెట్టాడు. రోడ్డు మీద వెళుతున్న వారిని ఈ గాడిదలు ఎవరివి అని ప్రశ్నించారు.
మాస్క్ లేకుండా..వచ్చాయని తెలిపాడు. కొంతమంది మాస్క్ లేకుండానే రోడ్ల మీదకు వచ్చారు. దీనిని ఆ జర్నలిస్టు ప్రశ్నించాడు. ఆ జంతువులకు, మనుషులకు ఏం తేడా అని ప్రశ్నించాడు. అంటే..మాస్క్ లేని వాడు గాడిద అనే అర్థం వచ్చే రీతిలో చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
That’s an innovative way to spread awareness. Kudos to this guy pic.twitter.com/HenpeOaHA0
— Roop Darak BHARTIYA (@iRupND) July 21, 2020
