మోడీని కలిసిన సింధియా..మధ్యప్రదేశ్‌లో అధికారం కోసం బీజేపీ ఎత్తులు

  • Publish Date - March 10, 2020 / 05:38 AM IST

మధ్యప్రదేశ్  రాజకీయాల్లో ముసలం రాజుకుంది. సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితికి చేరుకుంది. పతనం అంచులో ఉండటంతో కమల్ నాథ్ కు పదవీగండం తప్పేలా లేదు. జ్యోతిరాదిత్యసింధియా తిరుగుబాటును ప్రకటించటం..తన వర్గంలోనే 17మంది ఎమ్మెల్యేలతో జంప్అయిపోవటం..తాజాగా సింధియా బీజేపీవైపు మొగ్గుచూపుతుండటంతో దీంట్లో భాగంగా ప్రధాని మోడీతో సింధియా భేటీ కావటం  వంటి పలు కీలక అంశాలు కమల్ నాథ్ పదవికి గండంగా మారాయి.

కమల్‌నాథ్‌కు గుడ్ చెప్పిన సింధియా కేంద్రమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. దీని వెనుక బీజేపీ వ్యూహాలు ఎన్ని ఉన్నాయో ఊహించుకోవచ్చు. కమల్ నాథ్‌తో సింధియాకు చెడిన తరువాత దాన్ని కమలదళం తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ఢిల్లీనుంచి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను భోపాల్ పంపించింది. 

అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలను శివరాజ్ సింగ్ ఎప్పటికప్పుడు బీజేపీ అధిష్టానానికి అందజేస్తున్నారు. ఈ క్రమంలో సింధియాతోను..ఆ వర్గం ఎమ్మెల్యేలతోను కమల్ నాథ్ సంప్రదింపులకు యత్నిస్తున్నారు. కానీ వారి జాడ లేదు. వారంతా ఎక్కడున్నారో తెలుసుకోవాలని కమల్ నాథ్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు తెగ కసరత్తులు చేస్తున్నారు. సింధియాకు సంబంధించిన 17మంది ఎమ్మెల్యేలను బెంగళూరులోని  ఓరిసార్ట్స్ లో ఉంచినట్లుగా తెలుస్తోంది.వారిలో రాజీనామా చేసిన ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. 

బెంగళూరులోని  ఓరిసార్ట్స్ లో ఉన్నట్లుగా తెలుసుకున్న కమల్ నాథ్ వారితో కాంటాక్ట్ అయ్యందుకు యత్నిస్తున్న క్రమంలో సింధియా సడెన్ గా ప్రధాని మోడీని కలవటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెరపడే ప్రమాదంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలోని పెద్ద తలకాయలంతా కాంగ్రెస్ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారు. జ్యోతిరాధిత్య సింధియా భోపాల్ నుంచి ఢిల్లీ వచ్చి ప్రధాని మోడీని కలవటంతో అదే జరుగుతుందనీ..ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఈ అవకాశాన్ని వదులుకోదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

అయితే ఈ మొత్తం వ్యూహానికి జ్యోతిరాదిత్య సింధియానే కారణమన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. రెబల్ గా మారిన 17 మందిలో అత్యధికులు సింధియా వర్గం వారే కావడంతో ఈ సంక్షోభానికి సింధియానే కారణం అని కాంగ్రెస్లోని ఒక వర్గం తీవ్రంగా ఆరోపిస్తుంది. మరోపక్క ఎప్పుడు అధికార పీఠం దక్కించుకోవాలా అని ఆత్రంగా చూస్తున్న బీజేపీ..సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని గద్దెనెక్కాలను తనదైన శైలిలో ఎత్తులు వేస్తోంది.

 దీంట్లో భాగంగానే జ్యోతిరాదిత్యసింధియా నేరుగా ప్రధానితో భేటీ వెనుకాల ఉండే ఆంతర్యం అదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

See Also | రంగులు కాదు పూలు జల్లి హోలీ వేడుక జరుపుకున్నకిరణ్ బేడీ